'శవం'తో పెళ్లి...... భర్త తమ్ముడితో సంసారం!!!

sailaja Chintha


శవాన్ని పెళ్లి చేసుకోడం ఏంటి? భర్త తమ్ముడితో సంసారం చేయడం ఏంటి అనుకుంటున్నారా?? అవునండి మీరు విన్నది నిజమే. ఇది ఒక వింత ఆచారం... మన దేశంలో పెళ్ళికి, సంప్రదాయాలకు చాలా విలువ ఉంది.. భార్య భర్తల బంధం కూడా చాలా గొప్పగా ఉంటుంది.. ఒక భార్య, ఒక భర్త అంతే.. కాని పెళ్లి, సంప్రదాయాలు, ఆచారాలు ఒక్కో ప్రాంతాన్ని భట్టి ఒక్కోలా ఉంటాయి.. ఒక్కో మతం లో ఒకలా ఉంటాయి.. ఒక ఊరిలో పాటించే సాంప్రదాయాన్ని మరో ఊరిలో పాటించకపోవచ్చు.

 

 

రాష్ట్రాలు, దేశాలు.. ఇలా ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన సాంప్రదాయాలను పాటిస్తుంటారు. ఎవరికీ వారు వల్ల సంప్రదాయల విషయంలో ఎవరు ఎన్ని చెప్పిన వినరు. వీటిలో కొన్ని సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. వీటి గురించి తెలిస్తే ముక్కున వేలు వేసుకుంటాం. ఇదేమి "తలతిక్క సంప్రదాయం అని తల కొట్టుకుంటారు " ముఖ్యంగా.. దక్షిణ సూడన్‌లో పాటించే పెళ్లి సాంప్రదాయాల గురించి తెలిస్తే వామ్మో అంటారు. ఇక్కడ అమ్మాయిలకి పెళ్లిచూపులు లాంటివి ఏమి ఉండవు..

 

 

సంతలో పశువు మాదిరిగా, ఎవరికీ నచ్చితే వారు వధువుని కొనుకుంటారు... దానికి పరిహారం గా గోవులని కాని, విలువయిన వస్తువులని కాని తిరిగి ఇవ్వాలి.. ఇటీవల జరిగిన వివాహంలో ఓ వ్యాపారవేత్త వధువు తండ్రికి 500 గోవులను, 3 లగ్జరీ కార్లు, రూ.1,44,000 నగదు కట్నంగా ఇచ్చి 17 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్నాడు.

 

 


ఇంకొక దిక్కుమాలిన సంప్రదాయం ఉందట వీళ్ళకి.. ఎవరన్నా బ్రతికి ఉన్న వ్యక్తి కి పెళ్లి చేయాలనీ, నిండు నూరేళ్లు పసుపు కుంకుమ లతో ఉండాలని పెళ్లి చేస్తారు.. కాని ఇక్కడ మాత్రం "చనిపోయిన శవానికి ఇచ్చి పెళ్లి చేస్తారు.. ఇది ఇక్కడి ఆచారం అంట.
ఎవరి ఇంట్లోనైనా వ్యక్తి చనిపోతున్నాడని తెలిస్తే.. అమ్మాయి తరఫువాళ్లు ఆ ఇంటికి వెళ్లి సంబంధం కలుపుకుంటారు.

 

 

వరుడు పుటుక్కుమనగానే.. శవంతో పెళ్లి చేస్తారు. ఒక వేళ చనిపోయిన వ్యక్తికి తమ్ముడు లేదా అన్న ఉంటే.. వధువు వారితోనే సంసారం చేయాలి. శవాన్ని పెళ్లి చేసుకునే అమ్మాయిని వితంతువుగా చూడరంట.. పెళ్లయిన మహిళగానే చూస్తారు.. వేరే వ్యక్తి తో సంసారం చేసిన గౌరవిస్తారట.. గిరిజన తెగలలో ఎక్కువగా ఇలాంటి ఆచారాలు ఉన్నాయి.. మహిళల్లో చైతన్యం లేకపోవడం వల్ల ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి.

 

 

దక్షిణ సూడన్‌లో మరో విచిత్రమైన సాంప్రదాయం ఇది. పెళ్లి తర్వాత వధువు ఇద్దరు బిడ్డలకు తప్పనిసరిగా జన్మనివ్వాలి. .. ఒకవేళ బిడ్డకి జన్మ నివ్వకపోతే భర్త వేరే పెళ్లి చేసుకోవచ్చునట.... ఎవరిలో లోపం ఉన్న భార్య కి విడాకులేనట.. ఇలాంటి తలతిక్క సాంప్రదాయాలకు చరమగీతం పాడాలని ఐక్యరాజ్యసమితితో సహా ప్రతి ఒక్కరూ ఆ దేశంపై ఒత్తిడి తెస్తున్నారు. .. ఈప్పటికయినా మహిళల్లో చైతన్యం రావాలని కోరుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: