చికెన్ పచ్చడి!

Durga
చికెన్ పచ్చడి కావలసిన పదార్థాలు: చికెన్ - 500గ్రా.   కారం - 10గ్రా.     జీలకర్ర, మెంతుల పొడి - 1/2 స్పూన్ ఆవపొడి - 1 టీ స్పూన్ గరం మసాలా - 3 స్పూన్స్ అల్లం పేస్ట్ - 1 స్పూన్ నిమ్మరసం - ఒక కప్పు ఉప్పు, నూనె - తగినంత తయారు చేసే విధానం: చికెన్ కడిగి నీళ్ళు లేకుండా చూసుకోవాలి. వీలైతే ఆ ముక్కల్లో నీళ్ళు ఇంకి పోయేలా ఒక బట్ట మీద వేసి ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసి చికెన్ ముక్కలను బంగారు వర్ణం వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక గినెలో కారం, ఉప్పు, జీలకర్ర, మెంతుల పొడి, ఆవపొడి, గరంమసాలా, అల్లం పేస్ట్ వేసి అందులో నిమ్మరసం, కొద్దిగా కాగిన నూనె పోసి కలుపుకోవాలి. దీంట్లో వేయించుకున్న చికెన్ ముక్కలను వేసి కలపాలి. ఆకలిని పెంచే స్పైసీ.. చికెన్ పచ్చడి రెడీ..    - 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: