కావలసిన పదార్థాలు :
కోడిగుడ్లు : 4(ఉడికించినవి),
పండు మిరపకాయల పేస్ట్ : టీ స్పూన్,
పచ్చిమిరపకాయల పేస్ట్ : టీస్పూన్,
అల్లం : చిన్న ముక్క,
వెల్లుల్లి : 2,
చింతపండు గుజ్జు : 2 టేబుల్‌స్పూన్లు,
ఉప్పు : తగినంత,
ఉల్లిపాయ తరుగు :టేబుల్ స్పూన్,
వంటసోడా : చిటికెడు,
సోయా సాస్ : టీస్పూన్,
నూనె : తగినంత
తయారు చేసే విధానం:
బాణలిలో నూనె పోసి వేడయ్యాక గుడ్లు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీసి పక్కన పెట్టికోవాలి. విడిగా మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి నిమిషం పాటు వేయించాలి. దానితో పాటప సోయా సాస్, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి ఉడికించాలి. ఆ మిశ్రమంలో వేయించిన గుడ్లకు సాస్ పూసి వేయాలి.
చైనీస్ రైస్, రోటీ లేదా పరోఠాలోకి ఈ చిల్లీ ఎగ్ కాంబినేషన్ రుచిగా ఉంటుంది. గుడ్డు ఇష్టపడనివాళ్లు దీనికి బదులుగా బంగాళదుంపలు వాడి చిల్లీ పొటాటో చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన చిల్లీ ఎగ్స్ టేస్ట్ చేసి చూడండి.
మరింత సమాచారం తెలుసుకోండి: