విజయం మీదే: "కష్టం - అసాధ్యం" అనుకుంటే చీపురు పుల్లను కూడా కదపలేవు?

VAMSI
ఈ ప్రపంచంలో జీవిస్తున్న ఏ ఒక్కరికి అయినా సరే ఓడిపోవాలి అని ఉండదు. ప్రతి ఒక్కరికీ గెలవాలని ఉంటుంది. అయితే అందుకు తగ్గ శ్రమ చేయడం కూడా చాలా ముఖం అన్నది అందరూ తెలుసుకోవాలి. అయితే ఈ లక్ష్యాన్ని లేదా విజయాన్ని అందుకునే క్రమంలో మధ్య మధ్యలో ఎన్నో అడ్డంకులు, ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అంత మాత్రాన వాటికి భయపడి పోయి మీ లక్ష్యాన్ని వదిలేయడం లేదా మార్చుకోవడం అన్నవి చేయకూడదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దైర్యంగా ముందుకు సాగితేనే విజయం మీకు దక్కుతుంది. అయితే కొందరు మాత్రమే లేని పోని కారణాలు చెప్పుకుంటూ లక్ష్యానికి దూరం అవుతూ ఉంటారు .
ఉదాహరణకు కొందరు తాము చేసే పనిలో సాకులు వెతుక్కుని దాటేస్తుంటారు. కొందరు ఏమో తాము చేసే పని చాలా కష్టం, ఇది అసాధ్యం అనుకుంటూ కాలాన్ని గడిపిస్తూ ఉంటారు. ఇలా పని చేయకూడదు అనుకునే వారికి ప్రతి పని ప్రతి సమస్య భారం గానే ఉంటుంది. మన లక్ష్యాన్ని సాధించడం మన బాధ్యత, ఎదురయ్యే అన్ని రకాల అనుభవాలను ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకోవడం మన సంకల్పం అనుకుంటే అన్ని సమస్యలు, కష్టాలు భారంగా కాదు మన లక్ష్యం కన్నా చాలా బలహీనంగా కనిపిస్తాయి. చూసే దృష్టి, ఆలోచించే కోణాన్ని బట్టి సందర్భానుసారంగా వచ్చే ప్రతి అనుభవం ఆ విధంగా కష్టమనో, సులభమనో కనపడుతుంది .
అందుకే ముందుగా ప్రయత్నమే కాదు మన ఆలోచన కూడా పాజిటివ్ గా ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలం. కాబట్టి ఇప్పటి కైనా జీవితాన్ని సీరియస్ గా తీసుకుని మీరు చేసే ప్రతి పనిలో 100 శాతం కష్టపడండి. అలాగే మీరు చేసే పనిలో కష్టాలు ఎదురైతే వారికి పరిష్కారం కనుగొని ముందుకు సాగండి.  అప్పుడే మీకు అనుకున్న ఫలితం దక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: