విజయం మీదే: నిజమైన గెలుపు ఏదో తెలుసా?

VAMSI
చాలా మంది మాములుగా అనుకునేది ఏమిటంటే, గెలవాలంటే ఇతరులను ఒడించాలి అని, వారిని మన కంటే తక్కువని ప్రూవ్ చేయాలి అని... కానీ ఇలాంటి వారందరికీ తెలియని ఒక వాస్తవం ఏమిటో తెలుసా ? నిజమైన విజయం ఎప్పుడూ ఇతరుల ఓటమి లో కాదు, మీ సామర్ద్యత పై ఆధార పడి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నది స్వల్ప భేదం మాత్రమే. మనం గెలవాలి అంటే ఇతరులను ఓడించాల్సిందే కదా అని మీకు అనిపించవచ్చు. నిజమే మనం గెలవాలంటే మన పోటీ దారులను ఓడించాలి. కానీ వారి ఓటమిలో మన ఆనందాన్ని వెతకడం మంచిది కాదు.
గెలుపు మనకు ముఖ్యం అలాగే అందరికీ, కాబట్టి నీవు గెలిచినప్పుడు ఓడిన వారికి  కూడా చేయూత అందించాలి, వారికి అండగా నిలబడాలని ఒక్క సారి వారి స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఎలా ప్రవర్తించాలో మీకే అర్దం అవుతుంది. ఉన్నది ఒకటే జీవితం, తరువాత మళ్ళీ ఇంకో జన్మ ఉందో లేదో.. ఉన్నా ఇప్పుడు ఉన్న మన ఆత్మీయులు, బందువులు, స్నేహితులు తోటి వారు మళ్ళీ అలాగే అదే బంధంతో ఉండలేము. ఉన్న ఈ జీవితంలో వీలైనంత వరకు అందరినీ కలుపుకు పొండి , కలిసి పొండి అదే నిజమైన గెలుపు.
ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు మరియు ఓటమి అనేది సముద్రం లోని అలలు వంటివి వస్తూ ఉంటాయి వెళుతుంటాయి. కానీ మానవ సంబంధాలు జీవితాంతం ఉంటాయి అన్న విషయాన్ని గ్రహించి వాటిని కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది . మనిషి జీవితం సంతోషంగా గడప గలిగితే అంతకు మించిన గెలుపు మరొకటి ఉండదు. ఇప్పటికి అయినా సమయం మించి పోలేదు, ఈ క్షణం నుండి మీరు మారండి. మనిషిని ఓడించి గెలవడం కాదు, వారి మనసును గెలవండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: