విజయం మీదే: మీరు కొత్తగా ఉద్యోగానికి వెళుతున్నారా ?
తమ తోటి ఉద్యోగులు సరిగా పని చేసుకుంటూ యాజమాన్యం దగ్గర మంచి పేరు తెచ్చుకుంటే నచ్చదు. వారిని ఎలాగయినా చెడిపెయ్యాలి. యాజమాన్యం దగ్గర మంచి పేరు రాకుండా చెయ్యాలని తాపత్రయ పడుతుంటారు. ఇలాంటి వారి దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఎలా చేస్తారు అంటే మీ దగ్గర మిగతా ఉద్యోగస్తుల గురించి చెడుగా చెబుతారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వారితో స్నేహం చేయకపోవడమే మంచిది. ఈ రోజు వారి గురించి చెడుగా చెప్పిన వాడు. రేపు మీ గురించి వేరే వారికి తప్పుగా చెప్పడని గ్యారంటీ ఏమిటి. కాబట్టి చాలా జాగ్రత్తగా మసులుకోండి.
మీరు చేస్తున్న చోట మీకు నచ్చకపోతే ఆ ఉద్యోగాన్ని మానెయ్యడమే మంచిది. అంతే కానీ అయిష్టంతో పని చేయడం మీకు మంచిది కాదు. ఒకవేళ యాజమాన్యం మీకు నిర్దేశించిన పనులు కాకుండా ఎక్స్ట్రా పనులు చెబితే ఖచ్చితంగా ప్రశ్నించండి. అంతే కానీ గంగిరెద్దులా తలూపుకుంటూ చేయకండి. నీకు కంపెనీ ఇచ్చిన బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నావు. అంత వరకే గుర్తించుకోండి. అంతే కానీ వేరే విషయాలపై శ్రద్ద పెడితే మీ కెరీర్ ప్రమాదంలో పడొచ్చు. ఇలా ఈ విషయాలను అర్ధం చేసుకుని పాటిస్తే ఒక ఉద్యోగస్తునిగా నువ్వు ఎక్కడ పని చేసినా సక్సెస్ సాధిస్తావు.