లాక్ డౌన్ వారిని వ్యాపారవేత్తలుగా మార్చింది ?

VAMSI
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా తలక్రిందులైపోయింది. దీని రాకతో మానవ జీవితం ఒక్కసారిగా ప్రశ్నార్ధకం అయిపోయింది. ఇంటి నుండి బయటకు వస్తే ప్రాణాలు ఎక్కడ పోతాయో అన్న భయంతోనే రెండు సంవత్సరాలు గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి సమయంలో కనీసం బయటకు వెళ్లి మనకు కావాల్సిన నిత్యావసర సరుకులు సైతం కొనలేని దుస్థితి. అయితే ఈ సమయంలోనే ఇద్దరు యువకులు ఆన్లైన్ ద్వారా కూరగాయలను మరియు నిత్యావసర వస్తువులను అమ్మడానికి అందరికీ సులభంగా ఉండడానికి ఆన్లైన్ యాప్ ను కనుగొన్నారు. జమ్మూ కాశ్మీర్ లాంటి లోయ ప్రాంతంలో ఆన్లైన్ లో నిత్యావసర వస్తువుల డెలివరీ చేయడమంటే చిన్న విషయం కాదు. జమ్మూ బాస్కెట్ అనే పేరు మీద ఈ కిరానా సరుకుల డెలివరీ ఎంతో సక్సెస్ ఫుల్ గా జరుగుతోంది.
ఆశిష్ మరియు అంకుష్ లు అక్టోబర్ 2020 వ సంవత్సరంలో ఈ జమ్మూ బాస్కెట్ యాప్ ను  స్టార్ట్ చేశారు. ఎప్పటికైనా ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మాన్ కావాలనుకునే కలను సాధించి చూపించాడు ఆశిష్. మొదటగా ఒక జమ్మూ కే పరిమితమైన ఈ స్టార్టప్ మెల్ల మెల్లగా దేశ వ్యాప్తంగా తన సేవలను అందిస్తోంది. వీరు ముఖ్యంగా జమ్మూలో పండే వస్తువులనే అమ్మడం అనేది గొప్ప విషయం. అందుకే ఇక్కడకు వచ్చే సందర్శకులు సైతం ఈ కాశ్మిరీ వస్తువులను కొనడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. వాటిలో షప్నినా షాల్, తీ లేదా డ్రై ఫ్రూట్స్ లాంటివి ఉన్నాయి.
ఆశిష్ ఒక ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత గురుగ్రామ్ లో  వి-మార్ట్ రిటైల్ లిమిటెడ్‌ మరియు ల్యాండ్ మార్క్ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. మొట్ట మొదటిగా వీరికి ఈ ఆలోచన వచ్చిన సమయంలో యాప్ లేదు. కానీ వీరు కొన్ని వస్తువులను వాట్సాప్ మరియు పేస్ బుక్ లోనే అమ్మడం ప్రారంభించారు. ఇలా వారి ఉత్పత్తులకు మంచి పేరు రావడంతో కొంత డబ్బుతో స్టార్టప్ ను స్టార్ట్ చేశారు. ఇలా తక్కువ వయసులోనే ఒక బిజినెస్ మాన్ గా మారినందుకు సంతోషంగా ఉందని వీరిద్దరూ తెలిపారు. ఇప్పుడు చాలా హాయిగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: