విజయం మీదే: నెగటివ్ ఆలోచనలకు ఇలా స్వస్తి పలకండి ?

VAMSI
మామూలుగా కొంత మంది చిన్న చిన్న విషయాలకు కూడా అతి జాగ్రత్తలు పోయి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని సమయాలలో ఈ ఆలోచనలే మీ ఆరోగ్యానికి, మీ జీవిత అభివృద్ధికి అడ్డు పడుతూ ఉంటాయి. మరీ ఈ కరోనా వచ్చిన తరువాత ప్రతి చిన్న విషయానికి చాలా ఎక్కువగా భయపడుతూ బాధపడుతున్నారు. ఇలా ఎక్కువగా ఒక విషయం గురించే ఆలోచించడం కారణంగా మానసికంగా వివిధ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఏదైనా జరిగేది జరగక మానదు. అలాగని రేపు ఏదో జరుగుతుందని ఆలోచిస్తూ బాధ పడడం మంచి పద్ధతి అనిపించుకోదు. ఎపుడూ మన మనసును ఎంతో ప్రశాంతంగా పాజిటివ్ గా ఉంచుకోవాలి. అప్పుడే ఎన్ని బాధలు ఇబ్బందులు వచ్చిన దైర్యంగా ఎదుర్కోగలరు.
ఇందు కోసం మీరు కొన్ని విషయాలు పాటించడం ద్వారా మీరు నెగటివ్ ఆలోచనలు నుండి పూర్తిగా బయటపడవచ్చు.


* ముఖ్యంగా జరిగిపోయిన విషయాల గురించి గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సంఘటనల గురించి ఆలోచించడం మానెయ్యాలి.
* అంతే కాకుండా ఏదైనా పనిని చేసేటప్పుడు ఆ పని యందు పాజిటివ్ గా ఉండాలి. అంతే కానీ ఆ పని జరుగుతుందా లేదా అని నెగటివ్ గా ఆలోచించ కూడదు.
*  మీకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఇబ్బంది కలిగించేలా ఉంటే అలాంటి వారిని దూరం పెట్టండి. మీ పరిసరాలను మీకు అనుకూలంగా మార్చుకోండి.
* మీ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే, మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. మీకు మీరే దైర్యం చెప్పుకోండి.
* మీకు ఏవైనా బాధలు ఉంటే, వాటిని మీ లోనే పెట్టుకుని కృంగి పోవద్దు. వాటిని మీ సన్నిహితులతో పంచుకోవడం వలన కొంత వరకు ఆ భారం తగ్గుతుంది.
ఇలా పై విషయాలను సక్రమంగా పాటిస్తే నెగటివ్ ఆలోచనలు పోయి సంతోషంగా ఉంటారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: