డిప్యూటీ కలెక్టరైన పారిశుధ్య కార్మికురాలు..!
ఆశా కుందరా రాజస్థాన్‌లోని జోథ్‌పుర్‌కు చెందిన పేద కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని ఆసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. మళ్లీ ఆమెకు చిన్నవయసులోనే పెళ్లిక చేశారు. భర్త వైఖరితో అత్తరింట్లో కూడా ఆమె ఉన్నత చదువు ఆశయం నీరు గారి పోయింది. తన పరిస్థితి తన పిల్లలకు రాకూడదనే జోథ్‌పర్ మున్సిపాలిటీలో పారశుధ్య కార్మికురాలిగా చేరింది. ఇదే క్రమంలో చదువుకోవడం మొదలు పెట్టింది. ఇంట బాధ్యతలు, విధులు, చదువును అన్నింటినీ చూసుకుంటూ చాలా కష్టపడి చదివింది. ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచి పని పూర్తి చేసుకుని అయిదు గంటలకల్లా విధులకు వెళ్లేదాన్ని. సాయంత్రం ఇంటికొచ్చాక చదువుకునే దాన్ని. దూరవిద్యలో చదవడంతో నా సందేహాలను డిగ్రీ చదువుతున్న పిల్లలను అడిగి తెలుసుకునే దాన్ని.
ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా శ్రమ చేశాను. పిల్లలకు చదువు చెబుతూ వారి ద్వార చదువు నేర్చుకునే దాన్ని. తన కార్యాలయంలో ఉన్నతాధికారులను, కలెక్టర్ వంటి వారిని చూసినపుడు వారిలా గౌరవాన్ని పొందాలని అనిపించేది అని, దాన్ని సాధించాలని సంకల్పం తో పట్టుదలగా ప్రయత్నం చేశాను. 2018 లో ఆర్ పి ఎస్ పరీక్షలకు హాజరై రాశాను. కరోనా కారణంగా ఫలితాలు ఆలస్యమయ్యాయి. ఈ మధ్యలోనే విడుదలయ్యాయి.
ఈ ఫలితాల్లో నేను 728 వా ర్యాంకు సాధించాను. ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ విజయం వెనుక మా అమ్మ నాన్నల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఈ నెల మొదటి వారంలోనే పారిశుద్ధ్య కార్మికురాలు శాశ్వత నియామక పత్రం కూడా వచ్చింది. ఇదే క్రమంలో ఆర్పిఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందడంతో డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలను తీసుకోనున్నాను. ఇక్కడే స్వీపర్ గా పనిచేసిన నేను అదే చోట డిప్యూటీ కలెక్టర్‌గా గౌరవాన్ని అందుకోవడం గర్వంగా ఉంది. ఇద్దరు పిల్లలతో ఎనిమిదేళ్ల క్రితం నుంచి వచ్చిన నేను నా పిల్లలను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని ఆలోచించాను. వారిని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలనుకున్నాను. ప్రజా పాలన అధికారిగా అందరి సంక్షేమానికి పాటు పడుగుతా` అని ఆశా కుందర అంటుంది