విజయం మీదే: పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా...?

VAMSI
ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిచేస్తేనే వారి వారి కుటుంబాలు సంతోషంగా జీవించగలుగుతాయి. అయితే కొంతమంది తక్కువ సమయం పనిచేయడానికి ఇష్టపడుతారు. మైరి కొంతమంది ఉన్న సమయంలోనే సమర్ధ వంతంగా పనిచేసుకుంటారు. ఇంకా కొంతమంది ఎక్కువ సమయం అంటే వారికి కల్పించిన సమయం కన్నా ఎక్కువ సమయం పని చేయాలని కోరుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో కొంచెం ఎక్కువగా పని తోహుడి ఉంటుంది. అలా కాకుండా కొన్ని సార్లు తక్కువ సమయంలో ఎక్కువ పని చేయాల్సినపుడు కూడా పని ఒత్తిడి కలుగుతుంది. ఇలా తరచూ జరగడం వలన మీ ఆరోగ్యం పై ఎంతో చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఈ పని ఒత్తిడిని తగ్గించుకోవడం ఎంతో అవసరం. కొన్ని సమయాల్లో పని ఒత్తిడి వలన నిద్ర సమయానికి రాదు. తద్వారా ఉదయాన త్వరగా నిద్ర నుండి లేవలేరు.
అయితే ఒక రోజంతా పని చేసి కూడా ప్రశాంతంగా ఉండడం ఎంతవరకు సాధ్యం...? ఇందుకు కొన్ని విషయాలను పాటించడం వలన వీలు పడుతుందని ప్రముఖ ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఏ పనికి ఎంత సమయం కేటాయించాలో..అంతే కేటాయించాలి...అప్పుడు మన పని మీద ఒత్తిడి తగ్గుతుంది. పని అనుకున్న సమయానికి పూర్తవుతుంది. ఎప్పటికీ మన పని యొక్క ప్రతికూల మరియు అనుకూల పరిస్థితులను మన అదుపులోనే ఉంచుకోవాలి. అప్పుడే మనము ఎక్కువ ఒత్తిడి లేకుండా పనిని పూర్తి చేయవచ్చు. ఇది స్ట్రెస్ హార్మోన్ ను యాక్టివేట్ చేస్తుంది మరియు ఒకవేళ దీర్ఘకాలికంగా ఉన్నట్లయితే, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత మరియు స్వస్థత కు లోనయిపోతాయి. మీరు నియంత్రించగల పరిస్థితులు మరియు మీరు చేయలేని అంశాలను గుర్తించాలని పలువురు సలహాలు ఇస్తున్నారు.
మీరు ఏదైనా ముఖ్యమైన మీటింగు ముగించుకుని బయటకు వచ్చినప్పుడు కొన్ని నిమిషాల దీర్ఘ శ్వాస తీసుకోవడం ఎంతైనా అవసరం. కేవలం ఐదు సెకండ్ల పాటు గాలిని పీల్చండి, ముక్కు ద్వారా సమాన సంఖ్యలో గాలిని పీల్చండి మరియు గాలిని బయటకు లాగండి. తద్వారా మీకు ప్రశాంతత కలుగుతుంది. మీకు కలిగే అనవసర అంతరాయాలు స్వస్తి పలకండి. మీరు మీ రోజును ఎలా ఉండాలనుకుంటున్నారో ఒక ప్రణాలికను చేసుకోండి. మీ శక్తిని అదే విధంగా ఉపయోగించండి. రాత్రిళ్ళు తొందరగా నిద్ర పొంది.. మరియు ఎక్కువ సమయాన్ని నిద్రకు కేటాయించండి.  ఒక ప్రజంటేషన్ కు ముందు భయాందోళనలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆలోచనలను మీరే ప్రోత్సహించడం ద్వారా మీరు సాధించడానికి స్ఫూర్తిని పొందుతారు మరియు చివరికి ఇతరులకు స్ఫూర్తిని అందించడంలో మీకు శిక్షణ నిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: