విజయం మీదే: పరీక్షల్లో చదివింది గుర్తు రావటం లేదా...?

VAMSI
చదువుకునే చాలా మంది విద్యార్థుల్లో కామన్ గా ఒక సమస్య ఉంటుంది. అదేమిటంటే విద్యార్థులు ఒక అంశాన్ని చదివే సమయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ విషయం గురించి పరీక్షల్లో రాయాల్సి వస్తుందో అప్పుడు అది గుర్తుకు రాదు. తద్వారా కొన్ని సమయాల్లో పరీక్షల్లో తప్పుతుంటారు. ఈ సమస్యకు ప్రధాన కారణం జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం. అయితే ఈ జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. మీరు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా  ఈ సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు. అయితే అవేమిటో ఒకసారి తెలుసుకుందామా...?
ముందుగా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆందోళన అస్సలు చెంద వద్దు. ఈ ఆహారాన్ని, అలవాట్లను ఇప్పటి నుంచి అమలు చేస్తే పరీక్షల సమయానికి మీ మెదడు అద్భుతంగా పని చేస్తుంది. ఈ రోజు నుంచే మీరు డైట్ నుంచి నిద్ర వరకు ప్రతి ఒక్కటి ఒక పద్ధతి ప్రకారం పాటించాలి. కొన్ని ఆహారాలు మరియు అలవాట్లు మెమరీ పవర్‌ను పెంచడమే కాకుండా మిమ్మల్ని అప్రమత్తంగా ఉంచుతాయి. ఆ ఆహార పదార్ధాలు ఏవో చూడండి.  ఆకు కూరలు, కాయగూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. కానీ, చాలామంది వీటిని తినడానికి ఇష్టం చూపించరు. కానీ ఇవి తినడం వలన మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
దీంతో ఆకు కూరలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు. ఆకు పచ్చ కూరగాయాల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. రోజూ రాత్రి వేళల్లో 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాలి. దీని వల్ల మీరు చదివినది ఎక్కువ సేపు గుర్తుండిపోతుంది. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివన్నీ సక్రమంగా పాటిస్తే మీకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: