విజయం మీదే: ఈ అలవాట్లను వదిలిస్తే మీ జీవితం ఆనందమయం...!
కొందరు తమ పొరపాట్లు తాము తెలుసుకొని సులభంగానే మారిపోతుంటారు. మరికొందరు తమకున్న చెడు అలవాట్లను ఎంత దూరం చేసుకోవాలని ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. వాస్తవానికి చెడు అలవాట్లకు అలవాటు చేసుకోవడం చాలా సులభం... కానీ అవే చెడు అలవాట్లను వదిలించుకోవడం చాలా కష్టం తరం. కానీ అసాధ్యం అయితే కాదు. కాబట్టి ముందుగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మనకున్న శ్రీనివాసులు మెల్లగా దూరం చేసుకొని పూర్తిగా మానేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం
* ముందుగా మనం ఏ చెడు అలవాట్లు మానేయాలి అనుకుంటున్నాం... అదేవిధంగా ఎందుకు మానేయాలి అనుకుంటున్నాము అన్నది గ్రహించాలి.
* ఆ తర్వాత ఆ చెడు అలవాట్లను మానేయాలని దడ సంకల్పంతో ముందుకు సాగాలి.
* మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మనం సిగరెట్ మానేయాలి అనుకుంటే ఒకవేళ అది మళ్లీ మనకు కనిపించిన.... మనల్ని మనం అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం చేసి చాలా రోజులు అయింది కదా.... ఒక్కసారి తాగితే ఏమి కాదులే అని అనుకోకూడదు.. అంతగా మన మనసుని మనం ఆధీనంలో ఉంచుకొని చెడు అలవాట్లను తిరిగి ప్రారంభించకూడదు.
* కొత్త విషయాలకు మన బ్రెయిన్ అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది... అది అర్థం చేసుకోవాలి. అంతేకానీ మనని మనం కంట్రోల్ చేసుకోలేము, ఇది మానేయడం మన వల్ల కాదు అని నిరాశ పడకూడదు. నెమ్మది నెమ్మదిగా ఆ చెడు అలవాట్లు మానేయడానికి ప్రయత్నం చేయాలి.
* ఇంకో చిన్న విషయం ఏమిటంటే... ఏదైనా చెడు అలవాటును మానేసే ముందు మన స్నేహితులతోనో, కుటుంబీకులతోనో చెప్పాలి... అప్పుడే మనం తిరిగి ప్రారంభించాలి అనుకున్నా... అవతలివారు ఏమనుకుంటారో అన్న మొహమాటంతో వాటి జోలికి వెళ్లకుండా ఉంటాము ఇది ఒక ట్రిక్ లాంటిది.
* అన్నిటికంటే ముఖ్యమైన విషయం... చెడు అలవాటు మానేయాలి మనం ఆత్మ స్థైర్యాన్ని మనం పెంపొందించుకోవాలి. మనల్ని మనం నమ్మాలి. అప్పుడే అనుకున్నది సాధించగలరుు.