విజయం మీదే : ఈ చిట్కాలు పాటిస్తే కరోనాపై విజయం మీ సొంతం
కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ గజగజా వణికిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 499కు చేరింది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కరోనా భారీన పడితే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కొన్ని చిట్కాలు పాటిస్తే కరోనాపై విజయం సాధించడం కష్టమేమీ కాదని వైద్యులు చెబుతున్నారు.
కరోనా సోకకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ శుభ్రతతో పాటు సామాజిక దూరం పాటించాలి. కరోనా వైరస్ వాతావరణాన్ని బట్టి, వస్తువులను బట్టి మూడు గంటల నుండి 72 గంటల వరకు బ్రతికే అవకాశం ఉంది. ఈ వైరస్ ఎక్కువగా కళ్లు, ముక్కు, నోటి ద్వారా మాత్రమే శరీరంలోకి ప్రవేశిస్తోంది. వైరస్ సోకకుండా ఉండాలంటే వస్తువులను తాకేముందు కచ్చితంగా ఆల్కహాల్ తో తయారైన శానిటైజర్ లను వాడాలి.
హ్యాండ్ వాష్ చేసుకున్న తరువాత ఉల్లిపాయలను చేతులకు రుద్దుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలా చేస్తే చేతులు ముఖంపైకి వెళ్లిన ప్రతిసారి ఉల్లి వాసన తగిలి చేతులను దూరం జరుపుకుంటామని చెబుతున్నారు. మాస్క్ ఉపయోగిస్తే కరోనా కచ్చితంగా సోకదని పరిశోధనల్లో తేలింది. వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. శానిటైజర్ ఉపయోగిస్తే చేతులతో వైరస్ ను తాకినా అది వెంటనే చనిపోతుంది. కొన్ని రోజుల పాటు జనసందోహం ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉంటే కరోనాపై విజయం సాధించడం కష్టమేమీ కాదు.