విజయం మీదే : ఈ విధంగా చర్చించి, వాదిస్తే ఎక్కడైనా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

మనం రోజువారీ జీవితంలో వృత్తి పరంగా, వ్యక్తిగత అవసరాల కోసం ఎంతోమందిని కలుస్తూ పరిచయాలను పెంచుకుంటూ ఉంటాం. అలా పరిచయమైన వారితో కొన్ని విషయాల గురించి చర్చలు జరుపుతూ ఉంటాం. కొత్త వ్యక్తులతో చర్చించటం వలన జ్ఞానం పెరుగుతుంది. జీవితంలో చాలా సందర్భాలలో కొత్త వ్యక్తులతో చర్చించిన విషయాలు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగపడతాయి. 
 
చర్చల వలన మనకు ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. కానీ కొందరు మాత్రం ఇతరులతో ఎలా చర్చించాలో తెలియక గొడవలు పడుతూ ఉంటారు. జీవితంలో ఒక వ్యక్తితో కానీ, బృందంతో కానీ చర్చించాల్సి వస్తే ఆ చర్చలో లేదా వాదనలో కొన్ని సూచనలు పాటిస్తే సులభంగా విజయం సొంతం చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఏ విషయంలో చర్చ, వాదన జరుపుతున్నా ఆ చర్చ, వాదన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికే తప్ప మాట నెగ్గించుకోవడం కోసం కాదని గుర్తుంచుకోవాలి. 
 
చర్చలో విజయం సాధించాలంటే మనం మాట్లాడుతున్న విషయం అందరినీ మెప్పించేలా ఉండాలి. చర్చల ద్వారా వ్యక్తుల మధ్య సంబంధాలు ఏర్పడటంతో పాటు చర్చల్లో పాల్గొన్న వారందరికీ విజయం లభిస్తుంది. చర్చలో పాల్గొనేవారు సహనాన్ని అలవరచుకోవటంతో పాటు ఎప్పుడు మౌనంగా ఉండాలో కూడా తెలుసుకోవాలి. వాదనల్లో ఎప్పుడూ మన కోణంలో మాత్రమే కాకుండా అవతలి వ్యక్తి కోణంలో కూడా ఆలోచిస్తూ రోజువారీ జీవితంలో చర్చల్లో పాల్గొంటూ కొత్త బంధాలు, కొత్త విషయాలు నేర్చుకుంటూ విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: