విజయం మీదే : మీపై మీకు నమ్మకం ఉంటేనే విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

జీవితంలో ప్రతి మనిషి విజయం సాధించాలంటే తనపై తనకు నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే ఆ పని అంతా గందరగోళంగా మారుతుంది. మనపై మనకు నమ్మకం ఉంటే ఎంతటి సమస్యలనైనా సులభంగా పరిష్కరించుకోవచ్చు. చాలా మంది నమ్మకం లేక జీవితంలో తమను తాము తక్కువగా అంచనా వేసుకొని ఓడిపోతూ ఉంటారు. అర్థం పర్థం లేని ఆలోచనలతో అసమర్థులుగా మారుతూ ఉంటారు. 
 
నమ్మకం లేకపోవడం వలన ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించాలో అర్థం కాక మరియు అనవసర భయాలతో పనులను మధ్యలోనే విడిచిపెడుతూ ఉంటారు. అనుభవజ్ఞులు ఏ పనినైనా చేసేముందు నమ్మకంతో లక్ష్యాలను పెట్టుకోవడం మంచిదని చెబుతున్నారు. సాధించాలనే నమ్మకం ఉంటే ఏ పనినైనా, ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చు. నమ్మకంతో మన లక్ష్యానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకోవాలి. 
 
ఆ ప్రణాళికను నిజాయితీగా ఆచరణలో పెట్టి ఏ విజయం సాధించినా దాని ఫలితం అనుభవించేది మీరే అనే విషయం గుర్తు ఉంచుకుని ముందడుగు వేయాలి. సమస్యలు వచ్చినపుడు చతికిలపడిపోవడం పిరికివాని లక్షణం అని ఏ పనినైనా సాహసవంతులు నమ్మకంతో పూర్తి చేస్తారని గుర్తుంచుకోవాలి. నమ్మకంతో చేసే ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా కృషి చేస్తే విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది.   విజయం ఒక నిరంతర ప్రయాణం! అని గుర్తించి రోజురోజుకీ కొత్తపుంతలు తొక్కాలి. విజయం అనితర సాధ్యం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: