విజయం మీదే : ఎగ్జామ్స్ టైమ్ లో ఈ టిప్స్ పాటిస్తే విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

మనం ఎంత చదివినా పరీక్షల్లో ఆ చదివినది ఎంత బాగా రాశామన్న దానిని బట్టే మార్కులు వస్తాయి. పరీక్షల సమయంలో చాలా మంది కొన్ని చిన్న చిన్న తప్పుల వలన మార్కులు కోల్పోతూ ఉంటారు. పరీక్షల కోసం నెలల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ రిజల్ట్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. మరికొంతమంది మాత్రం పరీక్షలకు కొన్ని రోజుల నుండి మాత్రమే చదువుతారు. 
 
కానీ పరీక్షలలో మాత్రం ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. కొన్ని టిప్స్ పాటిస్తే పరీక్షల సమయంలో సులువుగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. పరీక్షల సమయంలో చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ పరీక్షలు ఏ మాత్రం టెన్షన్ పడకుండా రాస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. కొన్ని సందర్భాలలో అదే పనిగా చదువుతూ ఉంటే అసలు బుర్రకెక్కదు. అలాంటి సమయంలో కొంత గ్యాప్ ఇచ్చి మనకు ఇష్టమైన పనిని కొంతసేపు చేసి ఆ తరువాత సబ్జెక్ట్ చదువుకుంటే చదివింది బాగా గుర్తుంటుంది. 
 
పాఠాలను బట్టీ కొట్టి చదవటం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. సబ్జెక్ట్ అర్థం చేసుకొని చదివితే ఎలాంటి ప్రశ్నకైనా సులభంగా సమాధానాలను గుర్తించటంతో పాటు మంచి మార్కులు వస్తాయి. పరీక్షల సమయంలో గుడ్లు, నట్స్, జ్యూస్ లాంటి ఆహారం తీసుకుంటే మంచిది. మసాలా ఐటెమ్స్, ఫాస్ట్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి. ఎగ్జామ్స్ ముందురోజు చాలామంది నిద్రమేల్కొని చదువుతూ ఉంటారు. కానీ అలా చదవటం వలన దాని ప్రభావం పరీక్షపై పడుతుంది. అలా కాకుండా మంచి నిద్ర ఉంటే మానసికంగా ప్రశాంతంగా ఉండి పరీక్షలు చక్కగా రాయొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: