విజయం మీదే : ఈ టిప్స్ పాటిస్తే ఇంటర్వ్యూలలో విజయం మీ సొంతం...!

Reddy P Rajasekhar

మనలో చాలామందికి ఇంటర్వ్యూ అనే పేరు వినగానే అదోరకమైన భయం మొదలవుతుంది. ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్థులకు ముఖ్యంగా ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఇంటర్యూకు ఎంపికవుతానో లేదో అనే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని టిప్స్ పాటిస్తే ఇంటర్వ్యూలలో సులభంగా ఎంపిక కావచ్చు. చాలా మందికి విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరు. ఈ క్రింది టిప్స్ పాటించటం ద్వారా ఇంటర్వ్యూను ఎదుర్కొని ఇంటర్వ్యూలలో సులువుగా విజయం సాధించవచ్చు. 
 
ఉద్యోగం చేయటానికి అవసరమైన వాటిలో ముఖ్యమైనది నైపుణ్యం. కావున మీలో ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు పుష్కలంగా ఉన్నాయని నిరూపించుకోవాలి. ఇంటర్వ్యూ అధికారులకు ఇతర అభ్యర్థులతో పోలిస్తే మీకున్న అదనపు అర్హతలను, ఉద్యోగానికి ఎంపికైతే కంపెనీ అభివృద్ధిలో ఎలా భాగస్వాములవుతారో చెప్పి మెప్పించాలి. ఇంటర్వ్యూకు వెళ్లే ముందు కంపెనీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి ఇంటర్వ్యూకు వెళితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాఅయి. 
 
ఇంటర్వ్యూలో ఉద్యోగం చేయాలనుకుంటున్న రంగాల్లో తాజాగా వస్తున్న మార్పుల గురించి, నూతనంగా మార్కెట్ లో ప్రవేశపెట్టిన ఉత్పత్తుల గురించి మాట్లాడటం వలన ఇతర అభ్యర్థులతో పోలిస్తే మీకు అవగాహనా స్థాయి ఎక్కువనే అభిప్రాయం అధికారులకు కలుగుతుంది. ఉద్యోగంలో అనుభవం ఉంటే గత అనుభవాలను గతంలో సాధించిన గొప్ప విజయాలను చెబితే ఉద్యోగం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
 
ఉద్యోగం ఇస్తే సంస్థ అభివృద్ధి కోసం ఏం చేస్తారో అధికారులకు వివరించాలి. సంస్థ పరంగా, ఉద్యోగం పరంగా ఏవైనా సందేహాలు ఉంటే ఇంటర్వూ పూర్తయ్యే సమయంలో అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలి. ఇంటర్వ్యూ పూర్తయిన తరువాత ఫలితం ఆలస్యమైతే టెన్షన్ పడకుండా హెచ్ఆర్ అధికారికి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకొని ఒక అవగాహనకు రావాలి. ఈ టిప్స్ పాటిస్తే ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: