విజయం మీదే: మీలో ఆత్మగౌరవం ఉందా?
ఆత్మగౌరవం మరియు స్వీయ-సామర్ధ్యం అనేవి వేరుగా అనిపించినా ఇవి రెండిటికీ చాలా దగ్గర సంబంధం ఉన్నాయి. ఆత్మ గౌరవం ఉన్న చోట సామర్ధ్యం దానికంతటికి అదే పెంపొందించబడుతుంది. ఇది భవిష్యత్ లో మన చర్యలు, స్వభావం పని తీరును దారిలో పెట్టి సామర్ధ్యాలను నిర్వహించగలమనే ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ క్రమంలో అనుకున్నది సాధించగలిగే నమ్మకాన్ని మనలో పెంచుతుంది. మీ అంతర్గత ఆలోచనలను సక్రమంగా ఉంచుకోవాలి. ఒకేసారి మార్పు రాకపోవచ్చు. కానీ మెల్లగా మన ఆలోచనలను మంచి వైపుకు మరలించాలి.
పాజిటివ్ గా ఉండటం ఆలోచించడం వంటివి అలవాటు చేసుకోవాలి. ఏదైనా సరే కాన్ఫిడెంట్ గా చేయాలి. అపుడే త్వరగా సఫలీకృతం అవుతారు. ఏ పని అయినా కొన్ని సార్లు అనారోగ్యం, వయసు, వృత్తి వైకల్యాలు మరియు భౌతిక పరిమితులు, స్వీయ గౌరవం పై ప్రభావితం చేయవచ్చు అయినప్పటికీ దృఢంగా నిలబడగలగాలి. ఈ విషయాలను బట్టి మీలో ఆత్మగౌరవం ఉందా? లేదా ఏ విధంగా దీనిని మీరు పొందగలరు అనేది ఓసారి ఆలోచించండి.