టీవీ: డబ్బుల కోసమే సెలబ్రెటీలు ఆ పని.. బిగ్ బాస్ వాసంతి షాకింగ్ కామెంట్స్..!

Divya
ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఏదైనా వాటిని ప్రచారం చేస్తున్నారంటే చాలు అభిమానులు పెద్ద ఎత్తున వీటిని వినియోగిస్తూ ఉంటారు.. ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీలు యూట్యూబర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలామంది ప్రజలు కూడా మోసపోతూ ఉన్నారు.. ముఖ్యంగా 10 పెడితే 100 లాభం.. లక్షపెడితే పది లక్షలు లాభం అనే విధంగా నెరవేస్తూ ఉన్నారు దీంతో చాలామంది ఈ ఉచ్చుల్లో పడి లక్షల కొద్ది అప్పులు చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు.


ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు.. ముఖ్యంగా బుల్లితెర స్టార్స్, యూట్యూబర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు.. అలాంటి వారిలో శ్రీముఖి, అషు రెడ్డి , వాసంతి , తదితర సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇలాంటివి సెలబ్రిటీలు సైతం ప్రమోట్ చేయడం వల్ల చాలామంది తెలియకనే డబ్బులు పోగొట్టుకుంటున్నారు.. ఈ విషయం పైన ఇటీవలే బిగ్ బాస్ బ్యూటీ వాసంతి కృష్ణన్ వెడ్డింగ్ యాప్స్ పైన పలు రకాల విషయాలను వెల్లడించింది.

హలో ఫ్యామిలీ.. తాను బెట్టింగ్ ట్రెండింగ్ ప్రమోషన్స్ ఏం చేసినా కూడా అవి పెయిడ్  కాబట్టే చేస్తున్నానంటూ వెల్లడించింది.. తనతో చాలామంది ఇలాంటి బెట్టింగ్ యాప్స్ లను సెలబ్రిటీలు కూడా ప్రమోట్ చేస్తున్నారంటే కేవలం వారంతా డబ్బుల కోసమే చేస్తున్నారని చెప్పవచ్చు.. మీకు ఇష్టమైతేనే మీరు డబ్బులు ఇందులో పెట్టండి లేకపోతే లేదు.. కానీ ఇలాంటి విషయాలపై మమ్మల్ని అసలు మాటలు అనడం ఏంటి అంటూ తెలియజేసింది.. గతంలో కూడా తాను చాలా సార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెబుతున్నాను దయచేసి అందరూ మేల్కోండి అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలలో రాసుకొచ్చింది వాసంతి.. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ పోస్ట్ చూసిన పలువురు నెటిజెన్స్ సైతం డబ్బుల కోసం ఇంత దిగజారుతారా అంటూ మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: