
ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం .. భారత్‌లో ఉంటుందా..?
అలాగే ఈ సూర్యగ్రహణం కేవలం అమావాస్య రోజున మాత్రమే వస్తుంది . ఇక ఆ సమయం లో సూర్యుడు చంద్రుడు భూమికి సరళలేఖలో ఉంటాయి .. పాక్షిక సూర్యగ్రహణం సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది .. మార్చ్ 29న వచ్చే సూర్య గ్రహణం ప్రపంచంలోని కొన్ని దేశాలకు మాత్రమే కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు .. భారతీయులు ఈ గ్రహణాన్ని చూసే అవకాశం లేదని కూడా అంటున్నారు .. ఉత్తర అమెరికా , యూరప్ , ఆఫ్రికా , ఉత్తఆసియా , దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో , గ్రీన్ ల్యాండ్ వాసులు ఈ పాక్షిక గ్రహణాన్ని చూడవచ్చు . అలాగే పశ్చిమ ఐరోపాలో మధ్యాహ్నం , ఆఫ్రికాలో ఉదయం పూట , తూర్పు యూరప్ లో సాయంత్రం వేళ ఈ గ్రహణం కనిపించబోతుంది .
అలాగే అమెరికాలోని స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4.50 గంటలకు పాక్షిక గ్రహణం మొదలవుతుందని నాసా చెప్పుకొచ్చింది .. అలాగే ఇది ఉదయం 6:47 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది .. ఆ తర్వాత ఉదయం 8:43 గంటలకు గ్రహణం ముగిస్తుంది .. అలాగే భారత కాలమాను ప్రకారం మధ్యాహ్నం 2:20 గంటలకు మొదలై సాయంత్రం 4:17 గంటలకు గరిష్ట స్థాయికి వెళుతుంది .. అలాగే కొన్ని ప్రదేశాల్లో గ్రహణం సమయంలో సూర్యుని 93% వరకు కనిపించకుండా ఉంటుందని అంచనా .. అయితే నాసా ప్రతిసారి గ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తూ వస్తుంది .. ఇప్పుడు కూడా ఈ గ్రహణాన్ని మన ఆన్లైన్ మధ్యమాల ద్వారా ప్రతి ఒక్కరు చూడవచ్చు అని కూడా అంటున్నారు.