సూపర్ హీరో శక్తులున్నాయని.. 4వ అంతస్తు నుంచి దూకాడు.. చివరికి?

praveen
ఓ 19 ఏళ్ల కుర్రాడికి హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలను చూడడం అలవాటుగా మారింది. ఈ క్రమంలో తనని తానూ సూపర్ హీరోగా ఫీల్ అయ్యేవాడు. దాంతో తన స్నేహితులకు నేను సూపర్ హీరోని, నాకు అతీత శక్తులు ఉన్నాయని చెప్పుకుంటూ తిరిగేవాడు ఆ కాలేజీ విద్యార్థి. అలా ఒకనాడు హాస్టల్‌లోని నాలుగో అంతస్తు ఎక్కి, స్పీడుగా పరుగెత్తుకుంటూ వెళ్లి, అక్కడినుండి అమాంతంగా కిందకు దూకేశాడు. కట్ చేస్తే, బీటెక్ చదువుతున్న ఆ విద్యార్థికి కాళ్ళు, చేతులు విరిగిపోగా.. భయంకరమైన ఇంటర్నల్ డామేజ్ జరిగింది. గమనించిన తోటి విద్యార్థులు, హాస్టల్‌ సిబ్బంది హుటాహుటినా అతన్ని ఆస్పత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేసారు.
ఈ షాకింగ్‌ తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకోగా, ప్రస్తుతం దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలికి వెళితే, తమిళనాడు కోయంబత్తూరులోని కర్పగం ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న 19 ఏళ్ల ప్రభుకు సినిమాలు చూడడం బాగా అలవాటు. ఈ క్రమంలో తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని బాగా నమ్మాడు. ఈ క్రమంలోనే తనకు శక్తులు ఉన్నాయంటూ ఎన్నోసార్లు తన తోటి విద్యార్థులకు చెబుతుండేవాడు. అయితే వారు పట్టించుకొనేవారు కాదు! ఏదో చెప్తాడు లే.. వాడొక పిచ్చోడు.. అనుకునేవారు. అయితే వారిముందు తన హీరోయిజం చూపించుకోవాలని కాలేజీ హాస్టల్ 4వ అంతస్తు ఎక్కి, అందరూ చూస్తుండగానే హఠాత్తుగా పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేశాడు.
ఇంకేముంది, అతని కాళ్లు, చేతులు విరిగి, తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దాంతో తనకు ఎలాంటి శక్తులు లేవని ఆ పిల్లాడు అర్ధం చేసుకున్నాడు. కానీ అప్పటికే పుణ్యకాలం చెల్లిపోయింది. దారుణమైన రక్తస్రావం కావడంతో ICUలో చికిత్స పొందుతున్నాడు. కాగా హాస్టల్‌ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బాధిత విద్యార్థి ప్రభు కోయంబత్తూరు సమీపంలోని మైలేరిపాళయంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్‌లో బీటెక్ చదువుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: