అడిగితే చాలు.. విడాకులు ఇప్పించే దేవాలయం ఎక్కడో తెలుసా..?

frame అడిగితే చాలు.. విడాకులు ఇప్పించే దేవాలయం ఎక్కడో తెలుసా..?

Divya
ఎవరైనా ఎక్కడైనా సరే కొన్ని పనులు నెరవేరాలంటూ కొన్ని దేవాలయాలకు వెళ్లి మొక్కుతూ ఉంటారు. అయితే ఎవరైనా విడిపోవాలనుకున్న వారు ఎక్కువగా కోర్టు మెట్లు ఎక్కుతూ ఉంటారు. కానీ జపాన్ లోని ఒక ఆలయంలో మాత్రం విడిపోవాలని ముక్కుంటే చాలు కచ్చితంగా విడాకులు వస్తాయనే నమ్మకం అక్కడ ప్రజలకు ఉందట.. అందుకే ఆ గుడికి సైతం డైవర్స్ టెంపుల్ గా పిలుస్తూ ఉన్నారు. మరి ఈ దేవాలయానికి గల కథ గురించి తెలుసుకుందాం.

మనం ఎన్నో దేవాలయాలను చూసే ఉన్నాము. అందులో కేవలం కొన్ని మాత్రమే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఫలానా దేవుడిని మొక్కితే చాలు మంచి జరుగుతుందని నమ్మకం చాలా మందిలో ఉంటుంది. పెళ్లి బంధం నుంచి దూరం కావాలనుకునే వారి కోరికలు సైతం నెరవేర్చి దేవుడు కూడా ఉన్నాడనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విడాకులు కావాలి అంటే ఎందుకు విడిపోతున్నారో చెప్పాలి.. అలాగే ఇద్దరు అంగీకారం కూడా ఉండాలి.. ఇలా అన్నిటిలో కూడా తమ భాగాలుగా చేసి కోర్టు సైతం విద్యార్థులను మంజూరు చేస్తుంది. అయితే ఇదంతా ఇప్పుడు పరిస్థితి.. మరి 600 ఏళ్ల క్రితం విడాకుల పరిస్థితి ఎలా ఉండేదో చాలామందికి తెలియకపోవచ్చు.

చాలామంది మహిళలు గృహహింసలు తట్టుకోలేక జపాన్ లో కామాకూర అనే పట్టణంలో  చాలామంది మహిళలు వెళ్లేవారట. భర్తలు పెట్టే హింసలను సైతం తట్టుకోలేక మహిళలు విడాకులు కోరుకునేవారట. వారికి ఆలయ అధికారులు సైతం ఆశ్రమం కల్పించి మరి విడాకులను మంజూరు అయ్యేలా చేసేవారట. అందుకే ఆలయంలో ఇప్పటికీ మహిళలు వచ్చారంటే చాలు కచ్చితంగా విడాకులు లభిస్తాయని నమ్మకం ఇప్పటికీ అక్కడ చెరిగిపోలేదు. అయితే కొన్ని వందల ఏళ్ళ క్రితం విడాకులు కావాలి అంటే కేవలం పురుషులకు మాత్రమే ఉండేదట.. కానీ భర్తలు పెట్టి హింసలు తట్టుకోలేక 1285 లో హోరిచ్చి  అనే మహిళ నిర్మించారట. దీనికి టోకీజీ అనే పేరు కూడా పెట్టారట. ఇది మహిళలకు ఆశ్రమం కోసం ఇచ్చేందుకు కట్టించిందట మహిళ. ఆశ్రమంలో మూడేళ్ల పాటు ఉన్నవారికి కచ్చితంగా విడాకులు మంజూరు అయ్యేలా చేసేదట మహిళ.. ఆ తర్వాత నెమ్మదిగా రెండేళ్లకు కుదించింది. 1902  వరకు ఈ ఆలయంలోకి మగవారు ప్రవేశించలేదట. ఆ తర్వాత కాలక్రమేనా చైర్మన్గా పురుషులను నియమించడంతో ఈ నిబంధనలు తొలగిపోయాయి. అలాగే విడాకులు కోరుతూ ఈ ఆలయానికి వచ్చే వారి సంఖ్య పెరగడంతో విమర్శలు కూడా రావడంతో కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలంటూ ఆలయ అధికారులు సైతం తెలియజేసినప్పటికీ టోకిజీ ఆలయానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతూనే ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: