ఎన్టీఆర్ ' దేవర ' మళ్లీ రిలీజ్... డేట్ కూడా ఫిక్స్...!
టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ విజయం కొట్టింది. సీనియర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అభిమానులను ఆకట్టుకుంది. ఇక సినిమా లో పెద్ద గా కథ లేకపోయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా కావడంతో ఈ సినిమా సాలిడ్ వసూళ్లు సాధించింది. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా రు. 550 కోట్ల గ్రాస్ వసూల్లు రాబట్టింది.
ఇక దేవర ఇప్పుడు జపాన్‌లో దుమ్ములేపేందుకు రెడీ అవుతోంది. జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్‌కు ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ ప్లాప్ సినిమాలు సైతం జపాన్ లో దుమ్ము లేపుతూ ఉంటాయి. ఈ క్రమంలో నే ఈ సినిమా ను జపాన్ లో మార్చి 28, 2025 న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇటీవల కల్కి సినిమాను అక్కడ రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ట్విన్, ఇప్పుడు ‘ దేవర ’ సినిమాను కూడా రిలీజ్ చేయనుంది.
ఇక ‘ దేవర ’ సినిమా ప్రీ - సేల్స్‌ను జనవరి 3 నుంచి ప్రారంభించనున్నారు. జపాన్‌లో ఎన్టీఆర్‌కు సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ‘ దేవర ’ సినిమాకు కూడా జపాన్‌లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కడం ఖాయమని అభిమానులు ధీమా తో ఉన్నారు. ఇక ‘ దేవర ’ సినిమా లో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.