అనగనగా ఒక రాజు : మూవీ లేట్.. ఎంతమంది మారిపోయారో తెలుసా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈయన కొంత కాలం క్రితం మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు . ఈ మూవీ లో అనుష్క శెట్టి హీరోయిన్గా నటించగా ... మహేష్ బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే చాలా కాలం క్రితమే నవీన్ పోలిశెట్టి "అనగనగా ఒక రాజు" అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ ని మొదలు పెట్టిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు.

ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటించనున్నట్లు , తమన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా విషయం టోటల్ సైలెంట్ అయిపోయింది. దానితో ఈ సినిమా అసలు ఉందా ..? క్యాన్సల్ అయ్యిందా అనే అనుమానాలు కూడా జనాల్లో రేకెత్తాయి. ఇక తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

దాని ప్రకారం ఈ సినిమాలో శ్రీ లీల స్థానంలో మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ నుండి తమన్ కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ విడుదల చేసిన వీడియో ద్వారా మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా లేట్ అవ్వడం వల్లో మరే కారణాల వల్లో తెలియదు కానీ ఈ మూవీ నుండి శ్రీ లీల తప్పుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: