రేవంత్‌ను టార్గెట్ చేయమని జగన్ ఆదేశాలు ఇచ్చేశారా ?
ఆంధ్రప్రదేశ్ లో ఈ యేడాది జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది వైసీపీ. ఓటమి తర్వాత వైసీపీ కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంది. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్లు ఏపీలో ప్రతిపక్ష హోదాలో అక్కడ ప్రజల పక్షాన పోరాటం చేయకుండా .. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడుతున్నారు. అనవసరం గా తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతూ .. విమర్శలు చేస్తూ పొద్దు పుచ్చుకుంటున్నారు. ఏపీ వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుంటున్నారు. వారు తెలంగాణ రాష్ట్ర సీఎంను ఎందుకు ? రెచ్చగొడుతున్నారో ? వారికే అర్థం కాని పరిస్థితి.
రేవంత్ ఫైర్ అయితే తమ ఆస్తులకు ముప్పు ఏర్పడుతుందన్న విషయం వారు మర్చిపోయి మరీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో వైసీపీ అధికార ప్రతినిధిగా మారి శ్యామల రేవంత్ రెడ్డి సర్కార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారో లేదో ... తాజాగా వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సమస్య పరిష్కారం కావాలంటే సోఫా రావాల్సిందేనని ట్వీట్ పెట్టారు. దీని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డి పెద్ద లంచగొండి అని .. ఆయన డబ్బులు వసూలు చేయడానికే ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పడమే. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు భగ్గు మంటున్నాయి.
ఇదిలా ఉంటే వైసీపీ పెద్దల అనుమతి లేకుండా రేవంత్ రెడ్డి ని శ్యామల , అంబటి రాంబాబు లాంటి వాళ్లు ఇలా టార్గెట్ చేయరని ... ఈ విషయం వైసీపీ హై కమాండ్ వ్యూహం ఉందనే అంటున్నారు. అంటే పరోక్షంగా బీఆర్ఎస్‌కు వైసీపీ సపోర్ట్ ఉందన్నది తెలుస్తోంది. రేవంత్ తెలంగాణ సీఎంగా ఉండడంతో జగన్ హైదరాబాద్ లో కూడా ఉండేందుకు ఇష్టపడడం లేదట. ఎక్కువుగా బెంగళూరు నుంచే రాకపోకలు సాగిస్తున్నారు.
జగన్‌కు హైదరాబాద్ లో ఏ రేంజ్‌లో ఆస్తులు ఉన్నాయో తెలిసిందే. జగన్ ఇలాగే తన పార్టీ వాళ్లతో రేవంత్ ను రెచ్చగొడితే జగన్ ఆస్తులు, బినామీ ఆస్తుల లెక్క తేలుస్తాడన్న సెటైర్లు పడుతున్నాయి.