హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2024: రోజాకు అష్ట దరిద్రమే..అవమానాలు, అపజయాలే?
దాదాపు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అలాగే మంత్రి పదవి చేపట్టిన మాజీ మంత్రి రోజా... ఈ సంవత్సరం ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. ఎన్నో అంచనాల మధ్య ఆమె బరిలో ఉండి... రాజకీయంగా అనుభవం లేని వ్యక్తి చేతిలో ఓడిపోయింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో.... ఆమె పరువు మొత్తం పోయింది. ఎన్నికల కంటే ముందు వై నాట్ 175 అంటూ.... జగన్ కంటే ఎక్కువగా రోజా అనే రెచ్చిపోయింది.
కానీ నగరి నియోజకవర్గంలో ఆమెకు.. ఎదురుగాలి వీచింది. ఏపీలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయిన మొదటి వ్యక్తి రోజా కావడం విశేషం. నగరి నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల కారణంగానే రోజా ఓడిపోయిందని ఇప్పటికి చెబుతూ ఉంటారు. ఏపీలో వైసిపి ఓడిపోవడంతో ఆమె కొన్ని రోజులు సైలెంట్ అయిపోయారు. అంతేకాదు తమిళ హీరో విజయ్ పార్టీలో చేరేందుకు రోజా రంగం సిద్ధం చేసుకున్నట్లు మొదటి వరకు వార్తలు వచ్చాయి.
అయితే చివరి క్షణంలో మళ్లీ ఏపీ రాజకీయాలు ఆక్టివ్ అయ్యారు మాజీ మంత్రి రోజా. రెండు రోజులకొకసారి ప్రెస్ మీట్ లేదా సోషల్ మీడియాలో... కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అయితే ఇదే ఊపు ఐదు సంవత్సరాల పాటు... కొనసాగిస్తే వచ్చే ఎన్నికల సమయానికి రోజాపై కాస్త సింపతి పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే మళ్లీ నగరి గడ్డపై వైసీపీ జెండా ఎగరడం ఖాయమని అంటున్నారు.