హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2024: అడవుల నుంచి అసెంబ్లీకి..పచ్చని చెట్ల నుంచి పచ్చ పెన్ను పట్టే దాకా.!

Pandrala Sravanthi
- నక్సలైట్ నుంచి మంత్రి వరకు
- సీతక్క ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు
- మహిళా మంత్రిగా దేశవ్యాప్త ఖ్యాతి.!


ఒకప్పుడు మహిళలంటే వంటింటికే పరిమితం అనేవారు. కానీ అలాంటి రోజులు మారిపోయాయి మహిళలు మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి కూడా వచ్చి సముచిత స్థానాలను అధిరోహిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధనసరి సీతక్క.. ప్రతి ఒక్కరు నోరారా అక్కా అని పిలుచుకునే సీతక్క తాను పదవ తరగతి కంప్లీట్ అయినప్పటి నుంచి ప్రజాసేవకై పరిమితమైపోయింది. ముఖ్యంగా ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ గన్ను పట్టి అడవుల వెంట తిరుగుతూ ఎంతోమంది పేదలకు న్యాయం చేసింది. అలాంటి సీతక్క గన్నుపడితే కొంతమందికే న్యాయం చేయగలనని భావించి ఆ తర్వాత నల్లకోటు వేసి కొన్నాళ్లపాటు న్యాయవాద వృత్తిలో కొనసాగింది. అది కూడా నచ్చని సీతక్క చివరికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అంచలంచలుగా మంత్రి వరకు ఎదిగింది. పచ్చని చెట్లల్లో తిరిగే ఈ అక్క పచ్చ పెన్ను పట్టి వేలాదిమంది భవిష్యత్తును మార్చేస్తోంది. అసెంబ్లీలో తను మాట్లాడితే దద్దరిల్లి పోవాల్సిందే. అలాంటి సీతక్క తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దుకుంది? ఎలాంటి ఇబ్బందులు పడింది? అనే వివరాలు చూద్దాం..
 ప్రజాసేవకై సీతక్క ప్రయాణం:


ఆదివాసీలకు అమ్మయింది. బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలిచింది. అలాంటి సీతక్క  మొదటిసారిగా 2004 లో రాజకీయ రంగ ప్రవేశం చేసింది. టిడిపి తరఫున పోటీ చేసి దారుణంగా ఓటమిపాలైంది. 2009లో మళ్లీ పోటీ చేసి  ఆ నియోజకవర్గంలో గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి పోడేం వీరయ్యను  ఓడించింది. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి చందూలాల్ చేతిలో ఓడిపోయింది. ఇదే తరుణంలో ఆమె 2017లో టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరి అఖిలభారత  మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే, చతిస్ ఘడ్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ అయింది. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో గెలిచి, తన గళాన్ని అసెంబ్లీలో వినిపించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ ఎదుర్కొని, ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కరోనా సమయంలో ఎంతోమంది పేదలకు తన సొంత డబ్బులతో సహాయం చేసి అదరహో   అనిపించింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా సీతక్క అంటే ఏంటో నిరూపించుకుంది.

అలాంటి సీతక్కని ఓడించాలని టీఆర్ఎస్ నాయకులు ఎన్నో పన్నాగాలు చేశారు. కానీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సీతక్క ప్రజల మన్ననలు పొంది ప్రజల ఓట్లతో మళ్ళీ గెలవగలిగింది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి అద్భుతమైన మెజారిటీ సాధించిన సీతక్క  తెలంగాణలో క్యాబినెట్ హోదా పొందింది. తెలంగాణ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అద్భుతమైన సేవలు అందిస్తోంది.. ఈ విధంగా సీతక్క పచ్చని అడవుల్లో తుపాకి పట్టుకొని తిరిగే స్థాయి నుంచి పచ్చని పెన్నుతో లక్షలాదిమంది జీవితాలను మార్చే స్థాయికి ఎదగడంలో ఎంతో కష్టపడిందని చెప్పవచ్చు. ఈ విధంగా 2023-24 సంవత్సరం ఆమె  మరపురాని మధురానుభూతిని మిగిల్చి ఒక రాష్ట్రాన్ని పాలించే మంత్రిగా బాధ్యతలు  అందించిన ఇయర్ గా మిగిలిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: