ఏపీ: ప్రజలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన నిత్యవసర ధరలు..!
అయితే మార్కెట్లో కిలో కందిపప్పు 160 రూపాయలు ఉండగా 10 రూపాయలు తగ్గించారు. దీంతో ప్రస్తుతం కందిపప్పు ధర 150 రూపాయలకు చేరింది.. అలాగే కిలో బియ్యం ధర 48 రూపాయిలు ఉండగా 47 రూపాయలకు చేర్చినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు తగ్గించిన ధరల తో రైతు బజార్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసింది కూటమి ప్రభుత్వం.. ఏ తగ్గించిన ధరలను గురువారం నుంచే ప్రజలు తీసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా తెలియజేశారు.
ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా ఆయా జిల్లాలలో ఉండే జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసినట్లుగా తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి కేవలం నెలరోజుల వ్యవధి కావడం చేత ఈనెల వ్యవధిలోని బియ్యం కందిపప్పు ధరలను రెండుసార్లు తగ్గించే ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చామని మరొకసారి గుర్తు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈనెల 11 నుంచి రైతు బజార్లో కిలో కందిపప్పు మార్కెట్లో 180 ఉండగా 160 కి చేసామని.. స్ట్రీమ్డ్ రైస్ 55 రూపాయలు ఉండగా 49కి చేశామని.. అలాగే ముడి బియ్యం 52 రూపాయలు ఉండగా 48 రూపాయలకు తగ్గించా మని ఇప్పుడు మరొకసారి ప్రభుత్వం తగ్గింపు విషయంలో మరొక నిర్ణయం తీసుకుందని తెలియజేశారు.