వైరల్ : జూ కీపర్ పై మగసింహం ఎటాక్.. ఆడ సింహం ఎలా ఆపిందో చూడండి?

praveen
సాధారణంగా సింహాన్ని అడవికి రారాజు అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే సింహానికి ఒక్కసారి ఆకలేసింది అంటే ఆ రోజు ఏదో ఒక జంతువుకి చివరి రోజు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక సింహం ఆ రేంజ్ లో భయానకంగా వేట కొనసాగిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఎంతటి భారీ జంతువునైనా సరే సింహం ఎంతో అలవోకగా ప్రాణాలు తీసేస్తూ ఉంటుంది. అందుకే సింహాన్ని చూస్తే చాలు మిగతా జంతువులు అన్నింటికీ  కూడా వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది.

 ఇలా అడవికి రారాజు అయిన సింహం చివరికి అటు ఆడు సింహం చెబితే వింటుందట.  సాధారణంగానే మగాళ్లు భార్య చేతిలో కీలుబొమ్మలు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే కేవలం మనుషులు మాత్రమే కాదు అటు సింహాలు సైతం భార్య మాట తూచా తప్పకుండా పాటిస్తాయి అన్నదానికి నిదర్శనంగా సోషల్ మీడియాలో కొన్ని ఘటనలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇక ఆడ సింహం ఏకంగా మగసింహాన్ని కంట్రోల్ చేస్తుంది అని ఎంతో మంది నిపుణులు కూడా చెబుతుంటారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో ఒక అనుభవం లేని జూ కీపర్ సింహాల మధ్యలోకి వెళ్లడం కనిపిస్తుంది. అయితే ఒక మగ సింహం అతనిపై ఏకంగా దారుణంగా దాడి చేసేందుకు సిద్ధమైతుంది. ఏకంగా అతన్ని నేలపై పడేసి లాగుతుంది  ఆ సమయంలో అక్కడే ఉన్న ఆడ సింహం జోక్యం చేసుకుంటుంది. మగ సింహాన్ని వెనక్కి నేట్టేస్తుంది. అయితే ఇక మగసింహం మళ్లీ దాడి చేసేందుకు వెళ్లగా ఆడ సింహం ఆ మగ సింహాన్ని బెదరగొట్టేస్తుంది అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు కావడంతో వైరల్ గా మారిపోయింది. అయితే ఇక ఆ జంతు సంరక్షుడు మాత్రం ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: