వార్నీ.. ఆర్టీసీ బస్సులు.. ఇలా కూడా ఉంటాయా?

praveen
భారతదేశంలో పాపులేషన్ చాలా ఎక్కువ. పేదరికం కూడా ఎక్కువే. అందువల్ల సొంత వాహనాలు కొనుక్కోలేక చాలామంది ప్రజలు ప్రయాణాల కోసం బస్సులు, ట్రైన్ల మీదనే ఆధారపడుతుంటారు. దీనివల్ల అందరికీ సీటు దొరకడం అనేది కష్టమైపోతుంది. కొందరు సీటును సంపాదించాలని చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. కొంతమంది కర్చీఫ్ వేస్తారు. ఇంకొంతమంది పరుగులు తీస్తూ సీట్లలోకి వెళ్లి కూర్చుంటారు. వారి లక్ష్యం ఒక్కటే, అదే ఎలాగైనా సీటు సంపాదించడం! ఈ క్రమంలో మిగతా ప్యాసింజర్లను కూడా తోసేస్తారు.
కొందరైతే ఏ డోర్ ఖాళీగా ఉంటే ఆ డోర్ నుంచి బస్సులోకి దూరిపోవాలని చూస్తారు. అయితే ఇటీవల ఒక యువకుడు వీరందరికీ వినూత్నంగా ఆలోచించాడు. అదేంటంటే రద్దీగా ఉన్న బస్సులో సీటు సంపాదించడానికి కిటికీ ద్వారా ప్రవేశించాలనుకున్నాడు. అందుకు అతడు సీటు ముందు ఉన్న కీటికి గ్లాస్ పక్కకు జరిపి అందులోకి వెళ్ళడానికి ట్రై చేశాడు. ఆ బస్సు అప్పటికే చాలా పాతది అయిపోయిందని తెలుస్తోంది. యువకుడు ముందుగా బ్యాగు బస్సులోపల విసిరేశాడు. కాళ్లు బస్సు లోపలకి పెట్టి తర్వాత మిగతా బాడీని కిటికీ గుండా దూర్చేద్దామని అనుకున్నాడు. ఈ క్రమంలో విండో గ్లాస్ ను ఆధారంగా పట్టుకున్నాడు. అయితే అతడి బరువుకు ఆ విండో డోర్ ఆగలేకపోయింది. అంతే అది ఒక్కసారిగా కిటికీ నుంచి ఊడిపోయి బయటకు వచ్చింది. కట్ చేస్తే యువకుడు గ్లాస్ తో సహా అంత ఎత్తు నుంచి ధబేల్‌మని కింద పడిపోయాడు.
 ఈ దృశ్యాలను మరొక వ్యక్తి తన ఫోన్ కెమెరాలో రికార్డు చేశాడు. ఈ విన్యాసం చేసిన యువకుడు ఒక విద్యార్థి అని తెలుస్తోంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగిందని సమాచారం. పైనుంచి కింద పడటం వల్ల సదరు విద్యార్థికి స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. కింద పడిన వెంటనే ఆ యువకుడిని పైకి లేపారు. ఈ బస్సు చాలా పాత బడిందని, ఇలాంటి వాటిని సీజ్ చేయాలని కొంతమంది డిమాండ్ చేశారు. మరి కొంతమంది సీట్ కోసం ఇలాంటి స్టంట్స్ చేస్తే కాళ్లు విరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: