వైరల్: నిమిషాల్లోనే అలాంటి పనిచేసిన నవవధూవరులు..?

FARMANULLA SHAIK
పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. నూతనంగా పెళ్లి చేసుకునే వారు ఎంతో సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని కలలు కంటారు. కానీ నేటి యువత అందుకు భిన్నంగా ఉన్నారు.వివాహం యొక్క ప్రాముఖ్యత తెలియకో.. లేదంటే అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో తెలియకో.. ఏమో తెలియదు గానీ.. చిన్న చిన్న కారణాలకే బీపీలు పెంచుకుని కోపావేశాలకు గురై పచ్చని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఓ జంట అర్ధాంతరంగా వివాహ బంధాన్ని ముగించేశారు. అసలేం జరిగింది. ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు.కువైట్‌లో నివాసముంటున్న ఓ జంట కొంతకాలం పాటు ప్రేమాయణం కొనసాగించింది. అనంతరం తమ అభిరుచులు, అభిప్రాయాలు కలవడంతో.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా.. వాళ్లిద్దరు కోర్టులో వివాహం చేసుకున్నారు. ఇక కొత్త జీవితం ప్రారంభిద్దామని అనుకుంటున్న తరుణంలో.. ఎవ్వరూ ఊహించని ఓ పరిణామం చోటు చేసుకుంది.పెళ్లైన మూడు నిమిషాలకే ఓ జంట విడాకులు కోసం కోర్టు మెట్లెక్కింది. ఈ షాకింగ్‌ ఘటన గల్ఫ్‌ దేశం కువైట్‌ లో జరిగింది. పెళ్లి తంతు పూర్తయ్యి పెళ్లి వేడుక నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో అనుకోకుండా పెళ్లి కూతురు కొంచెం స్లిప్‌ అయ్యి కింద పడింది. ఆ సమయంలో పక్కనే ఉన్న వరుడు పెళ్లి కూతుర్ని తెలివి తక్కువ దద్దమ్మ అని కొంచెం విసుక్కున్నాడు. దాంతో ఆ మాట విన్న పెళ్లి కూతురు ఆ నిమిషామే అతనికి విడాకులు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది. పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంటున్నానని పెళ్లి వారితో చెప్పి అక్కడ నుంచి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది.దాంతో తమ పెళ్లి రద్దు చేయాలని జడ్జిని కోరింది.అసలేమైందని జడ్జి ఆ ఇద్దరిని అడిగి తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఏర్పడ్డ ఆ సమస్యని పరిష్కరించాలని జడ్జి ప్రయత్నించారు కానీ.. భార్య మాత్రం వెనక్కు తగ్గలేదు. స్టుపిడ్ అనే మాట తనని తీవ్రంగా బాధపెట్టడంతో.. విడాకులు కావాల్సిందేనని తెగేసి చెప్పింది. దీంతో.. మరో దారి లేక జడ్జి వారి వివాహాన్ని రద్దు చేశారు. పెళ్లి చేసుకున్న మూడు నిమిషాలకే విడాకులు తీసుకోవడంతో.. చరిత్రలో వీరిది 'షార్టెస్ట్ మ్యారేజ్'గా నిలిచిపోయింది. గతంలో 2004లో ఓ జంట పెళ్లైన 90 నిమిషాలకే విడాకులు తీసుకొని 'అతిచిన్న వివాహం' రికార్డుని నెలకొల్పగా.. కువైట్ జంట ఆ రికార్డుని బద్దలు కొట్టింది.కువైట్ చరిత్రలోనే అతి స్వల్పకాల పెళ్లిగా దీనిని కోర్టు పేర్కొంది. నిజానికి 2019లో జరిగిన ఈ ఘటన తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: