నదిలో ఈదుతుండగా.. చుట్టుముట్టిన మొసళ్ళ గుంపు.. జీబ్రా ఎలా తప్పించుకుందంటే?

praveen
సాధారణంగా అడవికి రారాజు సింహం అని చెబుతూ ఉంటారు. కానీ ఆ సింహాన్ని సైతం నీటిలో ఉండి భయపెట్టేది మొసలి. ఎందుకంటే మొసలి నీటిలో ఉందంటే ఇక దానిని మించిన బలం కలిగిన జంతువు మరొకటి ఉండదు అని చెప్పాలి. ఒక్కసారి మొసలి నోటితో కరిచింది అంటే.. ఏకంగా ఎముకలు ఎండు పుల్లల్లా విరిగిపోతూ ఉంటాయి అని చెప్పాలి.

 అందుకే ఎంతటి భారీ జంతువు అయినా సరే మొసలి నుంచి తప్పించుకోవడం చాలా కష్టమే. అందుకే భూమి మీద ఉండే ఇతర జీవులను వేటాడే జంతువుల సైతం నీళ్లల్లోకి వెళ్లి చివరికి మొసలికి ఆహారంగా మారిపోవడం ఎన్నో సార్లు చూస్తూ ఉంటాం. ఇలా మొసలి ఎంత దారుణంగా దాడి చేస్తుంది అన్నదానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు మాత్రం ఒక జీబ్రా మొసళ్ల గుంపు నుంచి తప్పించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 సాధారణంగా ఒక్క మొసలి దాడి చేస్తేనే దాని నుంచి ఎంతటి భారీ జంతువు అయినా సరే తప్పించుకోవడం చాలా కష్టం. అలాంటిది ఇక్కడ జీబ్రాను మొసళ్ల గుంపు చుట్టుముట్టింది. అయినప్పటికీ ఇక ప్రాణాలను కాపాడుకోవాలి అనే భయం ఎలాగైనా తప్పించుకోవాలి అనే సంకల్పం చివరికి అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం అయ్యేలా చేసింది. అదృష్టానికి తెగింపు కూడా తోడవడంతో ఓ జీబ్రా చివరికి ముసళ్ల గుంపు నుంచి తప్పించుకుంది. ఇక తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అన్ని వైపుల నుంచి దూసుకు వస్తున్న మొసళ్ళు దాడి చేసిన చివరికి ఎంతో చాకచక్యంగా తప్పించుకోగలిగింది. ఇందుకు సంబంధించిన వీడియో చూసి నేటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు. ఆ జీబ్రా కి ఇంకా భూమి మీద నూకలు బాకీ ఉన్నట్టున్నాయి. అందుకే మొసళ్ళ గుంపు నుంచి తప్పించుకోగలిగింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: