కల్కిలో అశ్వద్ధామ ఉన్న గుడి ఎక్కడుందో తెలిస్తే షాకవుతారు?

Purushottham Vinay
కల్కి2898 AD: అశ్వద్ధామ ఉన్న నిజమైన గుడి ఇదే! ఎక్కడుందో తెలిస్తే షాకవుతారు? ప్రభాస్ కి బాహుబలి 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని కల్కి 2898ఏడీ మూవీ ఇచ్చేలా ఉంది. రెండు రోజుల్లోనే ఈ మూవీ 330 కోట్ల పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.మొదటి రోజు 190+ కోట్ల వసూళ్లు చేసింది. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ఎనౌన్స్ చేసింది. రెండో రోజు కూడా 140+ కోట్లు కలెక్షన్స్ రాబట్టి ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వీకెండ్ అయ్యేలోపు కల్కి మూవీ 500+ కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం గ్యారెంటీ అని తెలుస్తుంది.ఈ మూవీలో అశ్వద్ధామ పాత్రలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించారు. నిజం చెప్పాలంటే కల్కి 2898ఏడీలో భైరవ పాత్ర కంటే అశ్వద్ధామ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. గత కొన్నేళ్లలో అమితాబ్ బచ్చన్ కి ఈ స్థాయి పాత్ర పడలేదనే మాట బాలీవుడ్ లో ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అందుకే నార్త్ ఇండియాలో కల్కి చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. మైథాలజీ కాన్సెప్ట్ తో ఎడాప్ట్ చేసుకొని ఫ్యూచరిస్టిక్ మూవీగా నాగ్ అశ్విన్ కల్కి 2898ఏడీ మూవీని అద్భుతంగా ఆవిష్కరించారు.


ఇదిలా ఉంటే ఈ మూవీలో చెప్పని చాలా ప్రశ్నలకి పార్ట్ 2లో నాగ్ అశ్విన్ సమాధానం ఇవ్వనున్నాడని తెలుస్తోంది. అయితే ఇది మూడేళ్ళ తర్వాత వస్తుందని నాగ్ అశ్విన్ ఇప్పటికే చెప్పాడు. కల్కిలో అశ్వద్ధామ పాత్రని ఒక శివాలయంలో రివీల్ చేశారు. పాడుబడ్డ శివాలయం లోపల తపస్సు చేసుకుంటున్నట్లు ఈ మూవీలో అశ్వద్ధామ ఇంట్రడక్షన్ ఉంటుంది. అయితే ఈ సీన్ కోసం రియల్ టెంపుల్ షార్ట్ ని బయటికి నాగ్ అశ్విన్ చూపించడం జరిగింది.నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లాపురంలో పెన్నానది ఒడ్డున ఈ శివాలయం అనేది ఉంది. 300 ఏళ్ళ క్రితం నిర్మించిన ఈ గుడి తరువాత పెన్నానది వరదలతో ఇసుకలో కూరుకుపోయింది. కొన్నేళ్ల క్రితం మళ్ళీ పెన్నానది ఎండిపోయినపుడు ఈ ఆలయం పైభాగం కనిపించింది.ఇంకా అలాగే ఆలయంలోకి వెళ్లే ఒక మార్గం కూడా ఓపెన్ అయ్యింది. ఈ ఆలయాన్నే మనకి కల్కి మూవీలో చూపించాడు నాగ్ అశ్విన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: