ముగిసిపోతున్న జగన్ రాజకీయ జీవితం?

Suma Kallamadi
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘోరంగా విఫలమయ్యారు. ఇక కూటమిగా ఏర్పాటైన తెలుగుదేశం, జనసేన, బిజెపిలో పక్కా ప్లాన్ తో వ్యవహరించారు. తత్ఫలితంగా వైసిపి పార్టీకి ఘోరవాటమి తప్పలేదు. ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు ఏకపక్షంగా వ్యవహరించి టిడిపి కూటమికి మద్దతు ప్రకటించారు. ఇది బహుశా ఎవరూ ఊహించనిది. ఇంత ఘోరంగా ఓడిపోతామని వైసిపి పార్టీ వారు కలలో కూడా ఊహించి ఉండరు. అదేవిధంగా కూటమి వారు కూడా మునుపెన్నడూ లేని విధంగా గొప్ప మెజారిటీలతో గెలుస్తామని కలలో కూడా అనుకుని ఉండరు. అయితే కాలం చాలా మహిమ గలది. ఎవరికి ఎప్పుడు పట్టం గడుతుందో ఎవ్వరు ఊహించలేరు. ఆంధ్ర ఎన్నికల్లో అదే జరిగింది. గత ఐదేళ్ల వైసిపి అరాచకానికి తెరపడింది.
ఈ క్రమంలోనే అనేక మంది విశ్లేషకులు అనేక రకాలుగా వైఎస్ఆర్సిపి పార్టీ ఎందుకు ఓడిపోయింది అనే కోణంలో విశ్లేషణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు ఎన్ని విషయాలు చెప్పినా అందరు సారాంశం ఒకటిగానే అనిపిస్తుంది. అదే హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం. అవును, గత ప్రభుత్వం హత్య రాజకీయాలను ప్రోత్సహించింది అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ కారణం చేతనే వైఎస్ఆర్సిపి పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయిందని అంటున్నారు. ఇక హత్యా రాజకీయాలు అనేవి ఎప్పటినుండో ఉన్నప్పటికీ, జగన్ హయాంలో మరింత దారుణంగా జరిగాయని, వాటిని ప్రజలు అస్సలు ఉపేక్షించలేదని తెలిపారు. ఈ కారణంగానే ముఖ్యంగా జగన్ ని జనాలు ఓడించారని విశ్లేషణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ... ప్రజలను భయపెట్టి రాజకీయాలను చేయలేరని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఇక వైసిపి పని అయిపోయిందంటూ జోష్యం చెబుతున్నారు. ఒక ఐదు సంవత్సరాలు వైసీపీని భరించిన ఆంధ్ర ప్రజలు మరో మారు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోరని ముక్తకంఠంతో చెబుతున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు...ఈ ఐదు సంవత్సరాలు తర్వాత రాబోయే ఎన్నికల్లో మేమే గెలుస్తామంటూ గప్పాలు కొడుతున్నారు. ఈ వ్యాఖ్యలు విన్న కొంతమంది రాజకీయ పండితులు నవ్వుతూ మరో మారు వైసీపీకి ప్రజలు అధికారం గాని ఇస్తే తన వేళ్ళతో తమ కళ్ళే పడుచుకున్నట్టు అవుతుందని సామెతలు చెబుతున్నారు. ఇక ఎవరెవరు మాటలు ఎలా రుజువు అవుతాయో తెలియాలంటే మరో ఐదేళ్లు వేచి చూడక తప్పదు! ఇక ఈ అంశంపై మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ లో అభిప్రాయాలను తెలియజేయగలరు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: