Budget -2024: నేడే బడ్జెట్ లో నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టే కీలక అంచనాలు ఇవే..!!

Divya
సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మద్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టడం అందరి దృష్టిని ఆకర్షణీయంగా మార్చేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. ఈ రోజున పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఈ బడ్జెట్ ప్రవేశ పెడుతూ ఉండడంతో అటు రైతులు, వాహనదారులు ,వేతన జీవులు, మహిళలు, నిరుద్యోగులు శుభవార్తలు ఉంటాయని చాలా భావిస్తున్నారు. మరి అందుకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి చూద్దాం.

ఈ బడ్జెట్లో కచ్చితంగా pm kison , ఆయుష్మాన్ భారత్, సూర్య దయ యోజన పథకాల వంటి వారికి చాలా ప్రయోజనాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.. అలాగే పన్నులు వంట గ్యాస్ ధరలు చమురు ధరలు తగ్గించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం పీఎం కిసాన్ కింద ప్రతి ఏటా 6000 అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి వాటిని 9000 వేలకు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం.. అలాగే ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఇప్పటివరకు ఐదు లక్షల బీమా అని మాత్రమే కవరేజ్ అందిస్తోంది. దీనిని రూ.10 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకునే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది జరిగితే సామాన్యులకు చాలా ప్రయోజనాలు ఉంటాయి.

అలాగే ఆయుష్మాన్ భారత్ ఉపయోగించి ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచితంగా రూ .10 లక్షల వరకు వైద్య సేవలు పొందవచ్చు. అలాగే పెట్రోల్ ధరలను కూడా తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండానే మరికొన్ని అంశాలు కూడా ఉండబోతున్నాయి.. ఈసారి ప్రభుత్వం యువత మహిళలు రైతులు పేద వర్గాల పైన చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.. ఫంక్షన్స్ కి కేంద్ర ప్రభుత్వం సేవింగ్ అకౌంట్ కలిగి ఉన్నవారికి పన్ను మినహాయింపు కల్పించే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరటను కలిగించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: