వైరల్: కరోనా నుంచి మీ పిల్లలని ఇలా రక్షించుకోండి..!!

Divya
మళ్లీ కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది.అయితే కరోనా మొదట్లో ఎన్నో ఇబ్బందులను పడి ఎట్టకేలకు బతికిన వారు కూడా ఉన్నారు.. అలాగే మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండేది..అయితే దానికి తగ్గ వ్యాక్సినేషన్లు వచ్చిన తర్వాత కరోనా అదుపులో ఉందని అనుకోవడంతో పాటు అందరూ ఈ విషయాన్ని మర్చిపోయారు. కానీ గడిచిన డిసెంబర్ నెల నుంచి కరోనా వైరస్ పేరు మళ్ళీ ఎక్కువగా వినిపిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా JN -1 వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని WHO సమస్త తెలియజేసింది. ఇప్పటికే ఇండియా, చైనా, UK  వంటి దేశాలలో 150 మందికి పైగా ఈ  వైరస్ బారినపడ్డారు. అయితే మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ వైద్య నిపుణులు మాత్రం చలా జాగ్రత్తగా ఉండండి అంటు  ప్రజలను సైతం  హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యాక్సిన్లు ఈ వైరస్ నుంచి రక్షణ ఇస్తాయో లేదో తేలీదని వైద్యులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు సైతం సోకే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయట అయితే పిల్లలకు ఈ వైరస్ సోకకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేస్తే సరిపోతుందట.

పిల్లల ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అలాగే వారికి మాస్కులు తప్పనిసరిగా ధరించాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వారికి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండేలా మంచి ఫుడ్ ని ఇవ్వాలని అలా వారు దృఢంగ ఉండేటువంటి విటమిన్స్ మినరల్ ఉన్న ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలని వైద్యులు తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా పిల్లలు లేవగానే ఎక్సర్సైజ్ వంటివే చేయించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు బయటనుంచి ఇంటికి వచ్చిన తర్వాత కచ్చితంగా వారి చేతులను శుభ్రంగా కడగడం మంచిది. దీనివల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది.

గోరువెచ్చని నీటిని ప్రతి రోజు తాగించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి.. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనాను అడ్డు కట్టాలి అంటే కచ్చితంగా వ్యాక్సినే ఉత్తమమైన మార్గం ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయించడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: