ఐదేళ్ల తర్వాత ప్రియుడిని కలిసిన యువతి.. ఎయిర్పోర్టులోనే ఏం చేసిందో చూడండి?
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న వారు ఇతర దేశాల్లో ఉన్న ఇక మనసుకు మాత్రం ఎంతో దగ్గరగానే ఉంటారు. ప్రతిరోజు మన పక్కనే ఉన్నారేమో అని భావన ఉంటుంది. ఇక రోజు కలవకపోయినా ఆ ప్రేమ అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇక ఇలా ప్రేమించిన వారు కొన్నేళ్ల తర్వాత కలవబోతున్నారు అని తెలిస్తే ఆ ఉత్సాహం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఒక యువతికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. విదేశాల్లో ఉంటున్న ప్రియుడు దాదాపు 5 ఏళ్ళ తర్వాత కలవబోతున్నాడు. దీంతో అతన్ని ఎప్పుడేప్పుడు చూస్తానా అని ఆమె కళ్ళు ఎదురు చూడటం మొదలుపెట్టాయి.
ఇలా తనను కలవబోతున్న ప్రియుడికి వినూత్నంగా స్వాగతం చెప్పాలి అని అనుకుంది ఆ యువతి. ఈ క్రమంలోనే ప్రియుడు కోసం వినూత్నంగా ఆలోచించి అతనికి వెల్కమ్ చెప్పింది. ఎయిర్పోర్టులోనే అతని ముందు ఎంతో అందంగా డాన్స్ చేసింది. నీకోసం నేను ఇన్నాళ్లు ఎంత ఆతృతగా ఎదురు చూశాను అన్న విషయాన్ని తన డాన్సులోనే వ్యక్తపరిచింది. ఇది కెనడాలోని ఎయిర్పోర్టులో జరిగింది అని తెలుస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇది చూసి ఎంతోమంది యువకులు కూడా ఫిదా అవుతున్నారు. ఆమె ఎంత అద్భుతంగా స్వాగతం పలికిందో అంటూ కామెంట్ చేస్తున్నారు.