వీడియో: పులితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరీ.. పాపం మహిళా?
ఆ వైరల్ వీడియో ప్రకారం, ఒక మహిళ ఒక పెద్ద పులిని ప్రేమగా నిమురుతూ దానితో కలిసి కాసేపు సమయం గడపాలి అనుకుంది. కొద్ది సెకండ్ల పాటు ఆమె పులి చర్మం తాకుతూ ఉంది. అయితే ఈ మృగం ఎప్పుడు ఎలా ఉంటుందో దానికే తెలీదు కాబట్టి అది ఒక్కసారిగా అగ్రెసివ్‌గా మారింది. అది సదరు మహిళ చేతిని, కాలును నోటితో పట్టుకుంటూ దాడి చేయబోతున్నట్లు ప్రవర్తించింది. అది ఆ మహిళను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కాళ్లు, చేతులు నోటితో పట్టుకుంటూ, పంజాతో దగ్గరికి లాక్కుంటూ ఆమెకు ముచ్చెమటలు పట్టించింది. కంగారు పడితే సదరు పులి విరుచుకుపడి క్షణాల్లో చంపేసే ప్రమాదం ఉంది కాబట్టి ఆమె చాలా సహనంగా వ్యవహరించింది.
ఆ పులిని ఏమార్చి తనని కాపాడాలంటూ సైగలు కూడా చేసింది. అయితే వైరల్ వీడియో చివరి వరకు ఆమె దాని నుంచి తప్పించుకున్నట్లు కనిపించలేదు. మొత్తం మీద ఈ పరిస్థితి నుంచి ఆమె బయటపడే ఉండొచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం పులుల దగ్గరకు వెళ్లడం ఎందుకు? ఇలాంటి ప్రమాదకర సిచువేషన్ లో పడటం ఎందుకు? చాలామంది ప్రజలు ఇలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తూ ప్రాణాలను కోల్పోతున్నారని కామెంట్లు చేశారు.