టమాటా చాలా కాస్లీ అని.. ఈ కోతికి కూడ అర్థమైందే?

praveen
ఒకప్పుడు దొంగలు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను బంగారు, నగలను లేదా నగదును దోచుకునేవారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా టమాటా దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే బంగారం వెండి కంటే నేటి రోజుల్లో టమాటానే బాగా విలువైనది అని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. ఇక భారీగా పెరిగిపోయిన టమాటా ధర సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. అటు ఎంతో మంది వ్యాపారులను మాత్రం రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారుస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం అని చెప్పాలి.

 ఇక  దొంగలు పడి ఏకంగా టమాటా పొలంలో టమాటాలు మొత్తం దొంగలించకపోయిన ఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే అటు టమాటా అనేది సామాన్యుడి వంటగదికి పూర్తిగా దూరమైపోతూ.. కేవలం సంపద కోసమే అన్నట్లుగా మారిపోయాడు. అయితే కేవలం మనుషులకు మాత్రమే కాదు అటు కోతులకు సైతం టమాట ఎంత కాస్లి అన్న విషయం అర్థమైంది అన్నట్లుగా ఇక్కడ ఒక ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.

 ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఒక కోతి వంటింట్లోకి వచ్చి మరీ టమాటాలను తీసుకెళ్లి పోయింది. తొలుత సాఫీగా లోపలికి వచ్చిన కొండముచ్చు ప్లాస్టిక్ బుట్టలో ఉన్న ఒక బంగాళాదుంపను టేస్ట్ చేసింది.. ఇంతలో పక్కనే ఉన్న ఎంతో ఖరీదైన టమాటా కనిపించింది. దీంతో ఆ కొండముచ్చు కూడా టెమిట్ అయిపోయింది. వెంటనే ఆ బంగాళాదుంపను కాకుండా టమాటాను టార్గెట్ చేస్తుంది. టమాటా ఎత్తుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇక ఈ వీడియో చూసి నేటిజన్స్ కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. కొండముచ్చుకి కూడా టమాటా విలువ ఏంటో అర్థం అయిపోయింది అంటూ ఎంతో మంది నేటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: