వైరల్ : పిల్లికి హెయిర్ కటింగ్.. మీసాలకు కూడా ట్రిమ్మింగ్?

praveen
సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాల వీడియోలు ప్రస్తుత కాలంలో వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇలాంటి వీడియోలు కొన్ని ఊహించని రీతిలో ఒక మంచి మెసేజ్ ఇస్తుంటే మరికొన్ని వీడియోలు మాత్రం అందరిని కడుపుబ్బా నవ్వుకునేలా చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. పనిలేని క్షరకుడు పిల్లికి తల కొరిగాడు అనే ఒక సామెత ఉంది. ఇక ఇప్పుడు అందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఈ సామెత గురించి చర్చించుకుంటున్నారు.

 ఇంతకీ ప్రస్తుతం ఈ సామెత మళ్లీ చర్చనీయాంశంగా ఎందుకు మారిందో తెలుసా.. ఇక్కడ ఈ సామెతకు తగ్గ అసలైన ఘటన జరిగింది. ఏకంగా ఒక వ్యక్తి పిల్లికి హెయిర్ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంతకీ క్షరకుడు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతో స్టైల్ గా పిలుచుకుంటున్న హెయిర్ డ్రెస్సర్. ఇక ఇటీవలే హెయిర్ డ్రెస్సర్ ఏకంగా తెల్లగా ముద్దుగా ఉన్న ఒక పిల్లి తలకు కటింగ్ చేశాడు.

 కేవలం తల మీద వెంట్రుకలను కటింగ్ చేయడమే కాదు ఇక మూతి మీద ఉన్న మీసాలను కూడా కత్తిరించాడు సదరు వ్యక్తి. అయితే పిల్లికి ఇలా ఎవరైనా కటింగ్ చేస్తున్నారు అంటే చాలు అది అక్కడి నుంచి పారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వీడియోలో కనిపించే తెల్లటి పిల్లి మాత్రం ఏ మాత్రం కదలకుండా బుద్ధిగా కటింగ్ చేయించుకుంటుంది అని చెప్పాలి. ఏకంగా సదరు హెయిర్ డ్రెస్సర్ కటింగ్ చేస్తూ ఉంటే పిల్లి మాత్రం హాయిగా కునుకు తీసింది. ఇక ఈ వీడియో చూసి ఎంతో మంది నేటిజన్లు అవాక్కవుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: