రోడ్డు ఆక్సిడెంట్ లు అనేవి తరచుగా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ వాటిల్లో చాలా భయంకరమైన ఆక్సిడెంట్ లు కూడా ఉంటాయి. బాగా భయపెడుతూ ఉంటాయి. కానీ తృటిలో ప్రమాదం తప్పుతుంది.అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇక తాజా ఆక్సిడెంట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.కార్లు రోడ్లపైకి వెళ్తుంటాయి. విమానాలు, హెలికాప్టర్లు వంటివి గాలిలో చక్కర్లు కొడుతుంటాయి. అయితే రోడ్డపై వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురవడం సాధారణమే.కానీ గాల్లో ఎగురుతున్న హెలికాప్టర్ రోడ్డుపై వెళ్తున్న కారుపైకి దూసుకొస్తే.. వామ్మో.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది నిజంగానే జరిగింది. కానీ పైలట్ అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపైన ఓ కారు దూసుకుపోతోంది. ఇంతలో ఎదురుగా ఓ హెలికాఫ్టర్ గాలిలో అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ వస్తోంది. ఆ దృశ్యం చూస్తే పెను ప్రమాదం ముంచుకొస్తుందని కనిపించింది. సరిగ్గా హెలికాఫ్టర్ ఆ కారు సమీపానికి వచ్చేసరికి పైలెట్ చాలా చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్‌ని పక్కకు తప్పించడంతో పెను ప్రమాదం తప్పింది. వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పింది.
ఈ ఘటన ఉక్రెయిన్‌లోని ఓ హైవేపై జరిగింది. అందుకు సంబంధించిన వీడియోని ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ 'వెల్‌కమ్ టు ఉక్రెయిన్' అనే క్యాప్షన్‌ని జోడించి పోస్ట్ చేసింది.దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పైలెట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అదీగాక రష్యా భూ, వాయు మార్గాల్లో బాంబు దాడులను కూడా వేగవంతం చేసింది. అందువల్ల గగన తలంలోని మిసైల్ దాడులను తప్పించుకునేందుకు, శత్రు రాడార్‌లు గుర్తించకుండా ఉండేలా ఇలా ఉక్రెయిన్ పైలెట్లు తక్కువ ఎత్తులో హెలికాప్టర్‌తో పయనిస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. బహుశా యుద్ధానికి సంబంధించిన ప్రాక్టీస్ అయ్యి ఉంటుందంటూ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ బాగా చక్కర్లు కొడుతూ వుంది.