తెలంగాణలో ఒక్కసారిగా మారిపోయిన రాజకీయ సమీకరణాలు.. ఏ పార్టీ స్టాండ్ ఎటువైపు..?

Pulgam Srinivas
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 2014 వ సంవత్సరం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి భారీ ఎత్తున అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దానితో కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దానితో కేసీఆర్ రెండవ సారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. 2023 వ సంవత్సరం డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.


ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున అసెంబ్లీ స్థానాలు రాలేదు. కాంగ్రెస్ పార్టీకి భారీ స్థాయిలో అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దానితో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నాడు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పెద్ద ఎత్తున సర్పంచ్ పదవులు దక్కాయి. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు కూడా మంచి స్థాయిలో సర్పంచ్ పదవులు దక్కాయి. ఇక బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థులకు కూడా మంచి స్థాయిలో సర్పంచు పదవులు దక్కాయి. ఇక తెలంగాణ రాష్ట్రం లో సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కే చంద్రశేఖర్ రావు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. దానిలో ఆయన అనేక విషయాలు గురించి మాట్లాడారు. దెబ్బకు ఆ ప్రెస్ మీట్ వైరల్ అయింది.


కెసిఆర్ స్పీచ్ తో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో కూడా మంచి ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా తనదైన రీతిలో ఆ స్పీచ్ పై కౌంటర్ ఇచ్చాడు. ఇక తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ , బిజెపి మూడు పార్టీలకు మంచి స్థానాలు దక్కడంతో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీ కూడా తక్కువ చేయలేం. ఏ పార్టీ అయిన మంచి అసెంబ్లీ స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: