"అంతా బాగుంది కానీ మధ్యలో ఆ పదం ఎందుకు వాడావ్ అక్క..?"..అనసూయకి కళ్యాణి వార్నింగ్ పై కొత్త డౌట్స్..!
సోషల్ మీడియాలో ప్రస్తుతం “శివాజీ” అనే పేరు తప్ప మరొకటి కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ వివాదం కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయినట్టుగా కనిపిస్తోంది. ఒక వర్గం శివాజీ చెప్పింది నిజమని మద్దతు తెలుపుతుంటే, మరో వర్గం మాత్రం ఆయన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ వ్యతిరేకంగా పోస్టులు పెడుతోంది.ఇదే సమయంలో టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి మాత్రం శివాజీకి గట్టిగా మద్దతుగా నిలుస్తూ రంగంలోకి దిగింది. ఆమె వరుసగా పోస్టులు పెడుతూ, అనసూయ, చిన్మయి వంటి నటీమణులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కౌంటర్లు వేస్తోంది. దీంతో ఈ వివాదం మరింత ముదిరిపోతోంది.
ఈ క్రమంలో శివాజీ ఇప్పటికే హీరోయిన్లకు క్షమాపణలు చెప్పినప్పటికీ, వివాదానికి మాత్రం చెక్ పడటం లేదు. శివాజీ – అనసూయ – కరాటే కళ్యాణిల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరి తర్వాత ఒకరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నారు.తాజాగా ఈ వివాదంలో మరో సంచలన మలుపు చోటు చేసుకుంది. కరాటే కళ్యాణి తాజాగా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె తన పోస్టులో,
“బట్టలు సరిగ్గా వేసుకోమని చెప్పడం కూడా తప్పేనా? వ్యక్తిగత స్వేచ్ఛకు నేను వ్యతిరేకం కాదు. కానీ హీరోయిన్లు పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చినప్పుడు కొంత హద్దు పాటించాల్సిన అవసరం ఉంటుంది” అంటూ వ్యాఖ్యానించింది.
అంతేకాదు, అనసూయను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ, “ఈ రోజుల్లో మంచిగా, పద్ధతిగా ఉండమని చెప్తే లీగల్ నోటీసులు పంపిస్తారు. కనసూయ… నీకే కాదు, మాకూ కేసులు వేయడం తెలుసమ్మా. కెలికావ్… ఇక పూర్తిగా రంగంలోకి దిగుతా” అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.అయితే ఈ పోస్టులో ఒక విషయం ఇప్పుడు నెటిజన్లను గట్టిగా ఆలోచింపజేస్తోంది. అనసూయ పేరు మధ్యలో “***” గుర్తులతో మార్చి ఉపయోగించడం ఎందుకు?** అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
అంతా బాగానే ఉంది కానీ, పేరు మధ్యలో అలా సూచనాత్మకంగా పదాన్ని వాడాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కావాలని చేసిన పరోక్ష విమర్శనా? లేక భావోద్వేగంలో జరిగిన తప్పిదమా? అన్న చర్చ మొదలైంది.
ఇప్పటికే వివాదాలతో వేడెక్కిన ఈ అంశానికి, కరాటే కళ్యాణి తాజా పోస్ట్ మరింత మసాలా జోడించింది. రాబోయే రోజుల్లో అనసూయ నుంచి గానీ, ఇతర నటీమణుల నుంచి గానీ దీనిపై స్పందన వస్తుందా? లేక ఈ మాటల యుద్ధం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాల్సిందే. మొత్తానికి, శివాజీ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు టాలీవుడ్‌లోని వ్యక్తిగత అభిప్రాయాలు, మహిళా స్వేచ్ఛ, పబ్లిక్ లిమిట్స్ వంటి అంశాలపై పెద్ద చర్చగా మారింది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారింది.