కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచింది. అయితే ఎన్నికలకు ముందు అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని బయట పెడతామని ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నాయకులు. తీరా అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా కానీ వీళ్లు కాళేశ్వరం,ఫార్ములా ఈ కార్ రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటపెట్టలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులకు సంబంధించి స్పీడ్ అప్ పెంచాలని అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త ఏడాదిలో ఈ కేసుల విచారణ పూర్తి స్థాయిలో జరగాలని, ఇందులో నిందితులు ఎవరైనా సరే వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
అలాంటి ఈ క్రమంలో గులాబీ నేతల్లో ఇప్పటికే గుబులు పట్టుకుంది. అయితే కొత్త ఏడాదిలో వీరిని విచారించి ఇంటికి నోటీసులు కూడా పంపబోతున్నట్లు తెలుస్తోంది. అయితే జనవరిలోనే ఎందుకు విచారణ చేస్తున్నారనే దానిపై కూడా కాంగ్రెస్ ఒక ప్రత్యేక వ్యూహం చేసినట్టు సమాచారం. జనవరిలో హైదరాబాద్ లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలోనే వీరిని విచారణ చేసి వారు చేసిన తప్పులను బయట పెడితే కాంగ్రెస్ కు మేలు జరిగి జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంది.
హైదరాబాదులో పట్టు సాధించడం కోసం వీరు చేసిన తప్పులను బయట పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వంఈ వ్యూహం రచించినట్టు సమాచారం. అందుకే రెండు సంవత్సరాల పాటు వీళ్ళు ఈ కేసులను నాన్చుతూ వచ్చి ప్రస్తుతం స్పీడ్ అప్ చేస్తున్నారు.. మరి వీరి వ్యూహం వర్కౌట్ అయితే మాత్రం హైదరాబాదులో కాంగ్రెస్ మార్క్ తప్పకుండా కనిపిస్తుంది.. మరి ఈ ప్లాన్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందా లేదంటే బీఆర్ఎస్ కు పాజిటివ్ గా మారుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.