వీడికి ఏం పోయే కాలం..ఇలా చేస్తున్నాడు?

Satvika
సోషల్ మీడియా వాడకం రోజు రోజుకు పెరిగి పోతున్న సంగతి తెలిసిందే..స్మార్ట్ ఫోన్ల వాడకం కూడా రెట్టింపు అవుతుంది..మన గురించి నలుగురికీ తెలియాలంటే ఏదోకటి చెయ్యాలని చాలా మంది అనుకుంటున్నారు.. అందుకే పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ అందరికి తల నొప్పిగా మారుతున్నారు..మొన్నటి వరకూ టిక్ టాక్ ద్వారా ఎంతో మంది సెలెబ్రేటిలు అయ్యారు..ఇప్పుడు మరోసారి సొంత ప్రయోగాలు చేస్తున్నారు.. తాజాగా వింత  ఘటన చోటుచేసుకుంది..ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడానికి చేసిన పని జనాలకు కోపాన్ని తెప్పించింది..

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలు సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తుండటంతో క్రియేటర్లు కూడా కొత్త కొత్త కంటెంట్‌తో వీక్షకులను ఆనంద పరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువ క్రియేటర్ షాకింగ్ పని చేశాడు. నడీ రోడ్డుపై అతడు చేసిన పని చూసి ప్రయాణికులు నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దుబాయ్‌లో ఆసియాకు చెందిన ఓ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్.. దిండును తల కింద పెట్టుకుని బిజీ రోడ్డుపై పడుకున్నాడు. జీబ్రా క్రాసింగ్ వద్ద అతడు పడుకున్న దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే యువకుడు చేసిన పని పోలీసుల దృష్టికి వెళ్లడంతో అధికారులు సీరియస్ అయ్యారు.


అంతేకాకుండా అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టారు. తన ప్రాణాలతోపాటు ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడే విధంగా ప్రవర్తించినందుకుగాను ఆసియాకు చెందిన సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌ను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ప్రాణాలకు హాని కలిగించే ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించబోమన్నారు. అంతేకాకుండా ఇటువంటి హానికర ఘటనలు కంట పడితే.. తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. కాగా.. పోలీసులు తీసుకున్న చర్యల పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పని తీరును ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: