పుష్ప ది రూల్ విజయం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయబోయే సినిమాల పట్ల జాతీయ స్థాయిలో ప్రేక్షకుల చూపు ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు బన్నీ పట్ల అభిమానం చూపిస్తున్నారు. దాంతో జాతీయ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించే కథల కోసం చూడాల్సిన బాధ్యత హీరో మీద పడింది. దాంతో దేవర తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న కొరటాల శివ తో సినిమా చేయడానికి చర్చలు సాగిస్తున్నారట. రీసెంట్ గా దేవర మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం సీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు బన్నీతో మూవీ చేసేందుకు చర్చించినట్లు సమాచారం. అయితే ఈ కాంబినేషన్ ఇప్పటిది కాదన్న విషయం తెలిసిందే.కొన్నేళ్ల క్రితం కొరటాల, బన్నీ కలిసి ఓ సినిమా చేయాలనుకున్నారు. కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఏమైందో తెలియదు
ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పుష్ప సిరీస్ చిత్రాల్లో బన్నీ నటించగా.. కొరటాల దేవర చేశారు. ఇప్పుడు మళ్లీ ఓ స్టోరీని అల్లు అర్జున్ కు కొరటాల శివ నెరేట్ చేశారని సమాచారం.
అయితే ఒకవేళ బన్నీ.. కొరటాల స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ సినిమా తెరకెక్కడానికి కచ్చితంగా టైమ్ పడుతుంది. ఎందుకంటే త్రివిక్రమ్ తో సినిమా అయ్యాక.. ఎప్పుడో కమిట్ అయిన సందీప్ రెడ్డి వంగాతో వర్క్ చేయనున్నారు అల్లు అర్జున్. అలా త్రివిక్రమ్, సందీప్ చిత్రాలు పూర్తయ్యేసరికి ఏం లేదన్నా నాలుగేళ్లు కచ్చితంగా పడుతుంది.దాంతోపాటు పుష్ప-3 కూడా బన్నీ చేయాల్సి ఉంది. అటు కొరటాల చేతిలో దేవర-2 ఉంది. ఆ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుద్దో ఇంకా తెలియదు. కాబట్టి కొరటాల- బన్నీ ప్రాజెక్ట్ సెట్స్ పై వెళ్లడానికి టైమ్ పట్టడం పక్కా అనే చెప్పాలి. అన్నీ కుదిరితే 2030లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.