వైరల్ : కలా నిజమా.. అతను ఎలా బ్రతికాడబ్బా?

praveen
సాధారణంగా రైలు ఎక్కే సమయంలో రైలు పట్టాలు దాటుతున్న సమయంలో ప్రతి ఒక్కరు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా కూడా చివరికి రైలు పట్టాల కింద పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఇలా చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చిన కొంతమంది మాత్రం రైలు ఎక్కడం విషయంలో రైలు సిగ్నల్ పడినప్పుడు గేటు దాటే  విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు అని చెప్పాలి.

 ఇక ఇలాంటి తరహా వీడియోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే వేగంగా వస్తున్న రైలు కింద ఎవరైనా చిక్కుకున్నారు అంటే అతను ప్రాణాలతో బయటపడటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న వ్యక్తి మాత్రం మృత్యుంజయుడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రాణం పోయింది అని అందరూ అనుకుంటున్న సమయంలో చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు సదరు వ్యక్తి. ఉత్తరప్రదేశ్లోని ఏటావా జిల్లాలో భర్తనా  రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగింది.

 రైలు కదులుతున్న సమయంలో ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించాడు సదరు వ్యక్తి. దీంతో ప్రమాదవశాత్తు ఇక రైలు కింద పడి పోయాడు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి ప్రమాదానికి గురై ఉంటాడని ప్రాణాలు కూడా పోవచ్చు అని భావించారు అందరు. కానీ తీరా రైలు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం అతడు పట్టాల మీద పడుకుని లేచి ప్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణికులు అందరికీ కూడా దండం పెట్టాడు. ఇది అక్కడ ఉన్న ప్రయాణికులను కూడా ఆశ్చర్యానికి లోను చేసింది అని చెప్పాలి. ప్రయాణికులు మాత్రం ఏం జరిగిందో అర్థం కాక అలా కాసేపు ఆశ్చర్యంగా అతని చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: