ఈ మధ్య వింత చేపలు మనుషుల ను భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి.. అందులో కొన్ని సోషల్ మీడీయా లో వైరల్ అయ్యాయి.. నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో వింత చేప అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. ఆ చేప చూడటానికి అచ్చం చేప పిల్లలాగా వుంది. దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా వానలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. ఈ మధ్య చేపల వర్షం గురించి కూడా మన దగ్గర తెగ వింటున్నాం. వర్షం తో పాటు చేపలు కూడా పడటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాదు వింత చేపలు సైతం ఈ మధ్య వలలకు చిక్కుతున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో వింత చేప ప్రత్యక్షమైంది. దమ్మ పేటలోని అప్పారావుపేట చెరువు లో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు వింత చేప చిక్కింది.
ఆ చేప ఒంటిపై నలుపు, తెలుపు మిళితమైన మచ్చలు కలిగి ఉంది. అంతే కాదు చేప నోరు కూడా కింది భాగంలో ఉంది. ఈ విషయం తెలియడం తో వింత చేపను చూసేందుకు స్థానికులు క్యూ కడుతున్నారు. ఇదివరకెప్పుడూ ఇలాంటి చేపను చూడలేదంటున్నారు స్థానికులు.. సముద్ర తీర ప్రాంతాల్లో, నదీ తీరాలు, చెరువుల సమీప ప్రాంతాల్లో సుడిగాలులు వచ్చిన సమయంలో నీటి తో పాటు చేపలు ఎగిరి మేఘాల లో చిక్కుకుంటాయి. అక్కడే అవి ఘనీభవించి కొద్దిదూరం ప్రయాణిస్తాయి. ఆ మేఘాలు కరిగి వర్షంగా కురిసినప్పుడు వాటిలోని చేపలు కూడా నేలమీద పడతాయని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.. ప్రస్తుతం ఈ వింత చేపకు సంభందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.. మీరు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..