మరదల్లా మజాకా.. ఏం గిఫ్ట్ ఇచ్చారో చూడండి?

praveen
పెళ్లి అంటేనే పెద్ద పండగ లాంటిది.. చిన్న పెద్దా అంతా కలిసి  ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలో సందడి చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో అయితే సామాన్యుల నుంచి సంపన్నులు వరకు ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని మరింత ప్రత్యేకంగా మార్చుకునేందుకు సరికొత్త రీతిలో వివాహాలు చేసుకుంటున్న  ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా పెళ్లి కూతురు చెల్లెలు తమ్ముళ్ళు కూడా బావను ఆటపట్టించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటివి అందరి పెళ్లిళ్లలో జరుగుతూనే ఉంటాయి. ఇలా మరదలు బావలను ఆటపట్టిస్తూ ఉంటే అక్కడ ఉన్న బంధువులు అందరూ కూడా చూసి నవ్వుకుంటూ మురిసిపోతూ వుంటారు.

 ఇక ఇలాంటి సరదాలు లేకపోతే పెళ్లి  లానే ఉండదు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో అయితే ఎంతో మంది ఏకంగా వరుడిని ఆట పట్టించేందుకు కాస్త కొత్తగా ట్రై చేస్తూ ఉండటం మాత్రం సోషల్ మీడియాలో కాస్త హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా పెళ్లి వేడుక పై ఉన్న వరుడుని ఆట పట్టించేందుకు ఇక పెళ్లి కూతురు చెల్లెలు అక్క లు అందరూ కూడా సిద్ధమైపోయారు ఈ క్రమంలోనే కొత్తజంట పెళ్లి రిసెప్షన్ కి ఫోటోలకి ఫోజులు ఇస్తున్న సమయంలో వేదికపైకి వచ్చి ఒక్కసారిగా బహుమతుల వర్షం కురిపించారు.

 అదేంటి బావకు మరదళ్లు గిఫ్ట్ ఇస్తే మంచిదే కదా ఇందులో కొత్త ఏముంది అని అనుకుంటున్నారు కదా.. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ల గురించి తెలిస్తే మాత్రం మీరే షాక్ అవుతారు. ఒకరు చీపురు మరొకరు చెత్త చాట ఇంకొకరు అట్ల కర్ర మరొకరు నాప్కిన్ లాంటి ఇక ఇంట్లో పని చేసే వస్తువులు అన్ని ఇచ్చి ఒక రకంగా మా అక్క ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ పనులు నువ్వే చేయాలి బావ అన్నట్లుగా ఇండైరెక్ట్గా చెబుతూ బహుమతులు  సమర్పించుకున్నారు. ఇక మరదళ్లు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత అక్కడున్న అతిథులందరూ కూడా తెగ నవ్వుకున్నారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: