వార్ని.. ఇలా కూడా ఎగ్జామ్ రాస్తారా?

Satvika
పరీక్షలు వస్తే చాలు విద్యార్థులు చాలా హడావుడి చేస్తారు. సంవత్సరం అంతా చదివిందానికన్నా కూడా ఎగ్జామ్ రెండు రోజులు అనగా పుస్తకాలతో కుస్తీ పడతారు. అప్పుడు నిజంగా స్టేట్ ర్యాంక్ వస్తుందేమో అని తల్లి దండ్రులు కూడా సంతోషంగా ఉంటారు. అయితే పరీక్ష హాల్ లోకి వెళ్ళగానే ఇక మరో టెన్షన్ మొదలవుతుంది. అలాంటి సమయంలో క్వచన్ పేపర్ పై ఫోకస్ పెట్టాలి. చాలా వరకూ విద్యార్థులు అదే పని చేస్తారు. కానీ ఇప్పుడు ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక వైపు ఎగ్జామ్ జరుగుతుంటే మరో వైపు విద్యార్థులు అంతా పాటలకు డ్యాన్స్ లు వేశారు.


ఏంటి.. నిజమా అని ఆశ్చర్య పోకండి.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఓ ప్రాంతం లో ఈ ఘటన వెలుగు చూసింది. మన రాష్ట్రాలలో కాదు లెండి..నార్త్ ఇండియాలో...వివరాల్లొకి వెళితే..ఈ ఘటన ఒడిశాలోని గాంజాం జిల్లాలో జరిగింది.. బారాముండాలి జిల్లాలోని హైస్కూల్‌లో ఇటీవల పదో తరగతి విద్యార్థులకు పరీక్షలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్కూల్‌లోని స్మార్ట్ క్లాస్‌రూమ్‌ను టీచర్లు వాడుకున్నారు. క్లాస్‌లోని స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ద్వారా అనేక అంశాల్ని వివరించారు. అయితే, శిక్షణ అనంతరం క్లాస్‌రూమ్‌కు లాక్ చేయకుండానే టీచర్లు వెళ్లిపోయారు. టీచర్లు వెళ్లిన తర్వాత కొందరు స్టూడెంట్లు తమ మొబైల్ ఫోన్ ద్వారా టీవీకి కనెక్ట్ చేశారు.


ఆ తర్వాత వారికి ఇష్టమైన పాటలను ప్లే చేస్తూ ఎంజాయ్ చేశారు.ఇటీవల అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినెషన్ లో వచ్చిన సినిమా పుష్ప..అందులోని పాటలు ఎంతగా ఫెమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..పుష్ప' చిత్రంలోని పాటను టీవీలో ప్లేచేస్తూ విద్యార్థులు డ్యాన్స్ చేశారు. విద్యార్థుల్లో కొందరు ఈ దృశ్యాలను వీడియో తీశారు. ఆ వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు స్కూల్ ప్రిన్సిపల్‌కు జిల్లా యంత్రాంగం షోకాజ్ నోటీసు ఇచ్చింది. అయితే, ప్రిన్సిపల్ ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందని జిల్లా యంత్రాంగం ఆమెను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఈ అంశం పై విచారణ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: